BigTV English

Rameshwaram Cafe Blast: అది బాంబు దాడే.. బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో పేలుడుపై కర్ణాటక సీఎం..

Rameshwaram Cafe Blast: అది బాంబు దాడే.. బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో పేలుడుపై కర్ణాటక సీఎం..

Rameshwaram Cafe Blast newsRameshwaram Cafe Blast news(Latest breaking news in telugu): బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి తొమ్మిదిమంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కేఫ్ స్టాఫ్, కస్టమర్లు ఉన్నారు.


బెంగళూరులోని కుండలహళ్లిలోని ప్రముఖ రెస్టారెంట్‌లో ఈరోజు జరిగిన పేలుడు బాంబు దాడేనని.. ఈ పేలుడులో తొమ్మిది మంది గాయపడ్డారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.

ప్రాథమిక నివేదికల ప్రకారం, మధ్యాహ్నం 1 గంటలకు కేఫ్‌లోని ఒక అనుమానాస్పద బ్యాగ్‌లో ఉంచిన వస్తువు పేలిపోయింది. క్షతగాత్రులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, క్షేమంగా ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.


రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించడంతో వైట్‌ఫీల్డ్ ఏరియా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కేఫ్ బెంగళూరులోని అత్యంత ప్రసిద్ధ ఫుడ్ ప్లేసస్‌లో ఒకటి.

ఫోరెన్సిక్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు కారణమేమిటనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Read More: Indrani Mukerjea case : షీనా బొరా హత్య కేసులో ఎన్నో ట్విస్టులు .. అసలేం జరిగిందంటే?

“రామేశ్వరం కేఫ్‌లో సిలిండర్‌ పేలుడు సంభవించినట్లు మాకు కాల్‌ వచ్చింది. వెంటనే అగ్నిమాపక యంత్రాన్ని అక్కడికి తరలించాము. సిలిండర్‌ పేలినట్లు ప్రాథమిక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అది నిర్ధారించబడుతోంది. ఇది చిన్న పేలుడు. గాయపడిన వారిని మేము ఆసుపత్రికి తరలించాము. మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం’’ అని పోలీసులు తెలిపారు.

పేలుడు ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నందున ఆ ప్రాంతంలోకి ఇతరులను అనుమతించట్లేదు.

ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక హోం శాఖ మంత్రి పరమేశ్వరన్.. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి పేలుడు గురించి వివరాలను తెలుసుకున్నారు.

బీజేపీకి చెందిన బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య ట్విటర్‌లో పోస్ట్‌లో ఈ టన గురించి పోస్ట్ చేశారు. తొమ్మిది మంది గాయపడిన పేలుడుకు కారణం ఏమిటనే దాని గురించి కేఫ్ యజమానితో మాట్లాడినట్లు చెప్పారు.

“రామేశ్వరం కేఫ్ వ్యవస్థాపకుడు శ్రీ నాగరాజ్‌తో తన రెస్టారెంట్‌లో జరిగిన పేలుడు గురించి ఇప్పుడే మాట్లాడాను. కస్టమర్ వదిలిపెట్టిన బ్యాగ్ వల్లే పేలుడు సంభవించిందని, సిలిండర్ పేలడం వల్ల పేలుడు సంభవించలేదని ఆయన నాకు తెలియజేశారు. వారి ఉద్యోగి ఒకరు గాయపడ్డారు. ఇది ఖచ్చితంగా బాంబు పేలుడే. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నుంచి బెంగళూరు స్పష్టమైన సమాధానాలు కోరుతోంది,” అని సూర్య పేర్కొన్నారు.

అటు బెంగళూరు పేలుడు తర్వాత తెలంగాణ పోలీసులు అలెర్టయ్యారు. హైదరాబాద్‌లో సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హైఅలెర్ట్ ప్రకటించారు. పలు కీలక ప్రదేశాల్లో నగర పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బెంగళూరు పోలీసులతో మాట్లాడి పేలుడుకు గల కారణాలను అడిగి తెలుసుకుంటామన్నారు.

Tags

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×