BigTV English

Indrani Mukerjea case : షీనా బొరా హత్య కేసులో ఎన్నో ట్విస్టులు .. అసలేం జరిగిందంటే?

Indrani Mukerjea case : షీనా బొరా హత్య కేసులో ఎన్నో ట్విస్టులు .. అసలేం జరిగిందంటే?
Sheena Bora Murder Case
Sheena Bora Murder Case

Sheena Bora Murder Case : ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ : ది బరీడ్ ట్రూత్.. ఈ డాక్యుమెంటరీపై పెను వివాదం రేగింది. ఎందుకంటే వాస్తవ కేసు ఆధారం తీయడంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నెట్ ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీ తెరకెక్కించింది. ఈ డాక్యుమెంటరీ విడుదలను ఆపాలని సీబీఐ కోర్టును ఆశ్రయించింది. బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే న్యాయస్థానం ఈ పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ : ది బరీడ్ ట్రూత్ విడుదలైంది. ఇప్పుడు ఇంద్రాణి ముఖర్జీ ఎవరు? షీనా బొరాను ఎవరు హత్య చేశారు? అసలు ఈ కేసు ఏంటీ? అనే చర్చ మొదలైంది.


షీనా బొరా కేసు?
2012లో షీనా బొరా ముంబై మెట్రో-1లో ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నారు. ఆమె అదే ఏడాది ఏప్రిల్ 14న మిస్సైయ్యారు. ఈ తర్వాత ఆమె అదృశ్యంపై దర్యాప్తు సాగింది. 3 ఏళ్ల తర్వాత షీనా బొరా హత్యకు గురయ్యారని పోలీసులు తేల్చారు. షీనా బొరా తల్లి  ఇంద్రాణి ముఖర్జీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2015 అగస్టులో ఇంద్రాణి అరెస్ట్ అయ్యారు. అలాగే ఇంద్రాణి రెండో భర్త పీటర్​ ముఖర్జీ, డ్రైవర్​ శ్యామ్​వర్​ రాయ్​ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల ముగ్గురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ముగ్గురు నిందితులపై కిడ్నాప్​, హత్య, మృతదేహాన్నిమాయం చేయడం లాంటి అభియోగాలతో కేసులు నమోదయ్యాయి.

శ్యామ్​వర్​ రాయ్​ పై అక్రమ ఆయుధాల కేసు నమోదుకావడంతో షీనా బొరా హత్యకేసు బయటకు వచ్చింది. ఆ తర్వాత ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీగా పోలీసులు నిర్ధారించారు. షీనా బొరా మర్డర్ డిటైల్స్ ను పోలీసులు వెల్లిడించారు. ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్​ ఖన్నా, డ్రైవర్​ శ్యామ్​వర్​ రాయ్ కలిసి షీనాను మర్డర్ చేశారని తేల్చారు. కారులోనే ఆమె గొంతును నులిమి ప్రాణాలు తీశారని నిర్ధారించారు.


Read More: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. నలుగురికి గాయాలు..

షీనా బొరా హత్యపై రాయ్ పోలీసులకు అన్ని వివరాలు వెల్లడించారు. 2012 ఏప్రిల్​ 24న బాంద్రాలో సంజీవ్ ఖన్నా షీనాను హత్యచేశాడని పేర్కొన్నాడు. డెడ్ బాడీని ఎక్కడ పడేయాలో ఇంద్రాణి సూచించారని తెలిపాడు. మృతదేహాన్ని.. వోర్లిలోని ఇంద్రాణి ముఖర్జీ ఇంటికి తీసుకెళ్లారని తెలిపాడు.

బ్యాగులో మృతదేహాన్ని పెట్టి.. కారులో ఇంద్రాణి ముఖర్జీ, సంజీవ్​ ఖన్నా , రాయ్ గగోడే గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడే మృతదేహాన్ని పడేశారు. పోలీసులు కథనం ప్రకారం సంజీవ్ ఖన్నా , రాయ్ నేరాన్ని ఒప్పుకున్నారు. కానీ ఇంద్రాణి నేరాన్ని అంగీకరించలేదు. షీనా బొరా అమెరికాలో ఉంటోందని కట్టు కథ అల్లారు. ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ పిటిషన్ ను 2021 నవంబర్​ లో బాంబే హైకోర్టు కొట్టివేసింది. 2022 మేలో సుప్రీంకోర్టు బెయిల్​ ఇచ్చింది.

హత్యకు కారణాలేంటి?
ఇంద్రాణి ముఖర్జీ ఫ్యామిలీలో జరిగిన అనేక విషయాల్లో షీనా బొరా హత్య కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. పీటర్​ ముఖర్జీ మొదటి భార్య కొడుకు రాహుల్. ఆ తర్వాత పీటర్ ను ఇంద్రాణి వివాహం చేసుకున్నారు. ఇంద్రాణి కుమార్తె షీనా. రాహుల్ తో లివ్​-ఇన్​ రిలేషన్ తో షీనా ఉందని ఇంట్లో తెలిసింది. ఈ సంబంధాన్ని ఇరుకుటుంబాలు వ్యతిరేకించాయి. షీనా హత్యలో పీటర్​ ముఖర్జీ నిందితుడే అని తేలింది. అరెస్ట్ తర్వాత ఇంద్రాణి ముఖర్జీ రకరకాల కథలు అల్లారు. షీనా బొరా తన కుమార్తె కాదన్నారు. సిస్టర్ వరుస అవుతుందని చెప్పారు. ఇదీ ఈ మర్డర్ హిస్టరీ..

 

Tags

Related News

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Big Stories

×