3 Schools in Tamil Nadu Receive Threatening E-Mails: దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. గతకొంతకాలంగా పాఠశాలలతో పాటు షాపింగ్ మాల్స్, హోటల్స్, విమానాశ్రయాలకు బెదిరింపుల కాల్స్ వరుసగా వస్తున్నాయి. ఇలా ఈ బాంబు బెదిరింపులు సర్వసాధారణమయ్యాయి. తాజాగా, తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు బెదిరింపుల కాల్స్ రావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.
మదురైలోని కేంద్రీయ విద్యాలయం, జీవన్ స్కూల్, వేలఅమ్మాల్ వంటి విద్యాసంస్థలకు సెప్టెంబర్ 30న ఉదయం బాంబు బెదిరింపులకు సంబంధించిన ఈ మెయిల్స్ వచ్చాయి. కొంతమంది గుర్తుల తెలియని వ్యక్తులు ఈ మూడు విద్యాసంస్థలకు ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఈ మెయిల్స్ వచ్చిన వెంటనే విద్యాసంస్థల యాజమాన్యాలు అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన మూడు బృందాలుగా ఆయా పాఠశాలలకు చేరుకున్నారు. అనంతరం బాంబ్ స్వ్కాడ్ రంగంలోకి దించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
ఈ మేరకు పోలీసులు బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ సహాయంలో మూడు పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు క్షుణ్ణంగా చేసిన తనిఖీలు ఎలాంటి బాంబు స్వాధీనం కాలేదు. అయితే ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలపై ఆరా తీస్తున్నారు. బాంబు బెదిరింపులకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
మరోవైపు, తమిళనాడులో పాఠశాలలకు బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం తెలుసుకున్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లలను పంపిన తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. తొలుత ఏ పాఠశాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చిన విషయం తెలియక టెన్షన్ పడ్డారు. తర్వాత మూడు పాఠశాలలకు అని తెలిసిన వెంటనే భయాందోళన గురయ్యారు. ఎలాంటి బాంబు దొరక్కపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ఊపిరిపీల్చుకున్నారు.
#WATCH | Madurai, Tamil Nadu: Kendriya Vidyalaya, Jeevana School, and Velammal Vidyalaya in Madurai received bomb threats through e-mails. Police and Bomb Disposal Squads reached the spot. Further details awaited.
(Visuals from Jeevana School, Madurai) pic.twitter.com/jgjmdhv7nn
— ANI (@ANI) September 30, 2024