BigTV English

Brazil Boy : 12 ఏళ్ల వయస్సుకే సిక్స్ ప్యాక్.. ఎలా సాధించాడంటే..?

Brazil Boy : 12 ఏళ్ల వయస్సుకే సిక్స్ ప్యాక్.. ఎలా సాధించాడంటే..?

Brazil Boy : ఆ బాలుడి వయస్సు 12 ఏళ్లు. కానీ ఫిట్ నెస్ దృష్టి పెట్టాడు. కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్ సాధించి.. అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. టైమ్ దొరికితే చాలు పిల్లలు ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఈ బాలుడు మాత్రం జిమ్‌లో కసరత్తులు చేస్తాడు. బ్రెజిల్‌ చెందిన ఆ బాలుడు పేరు కాజిన్‌యో నెటో . ఆ చిన్నారి తన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.


కాజిన్‌యో నెటో అసలు పేరు కార్లోస్‌ అగస్టో పిటాంగ నెటో. తన తండ్రిని చూసి జిమ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. రెండేళ్ల క్రితం జిమ్‌లో చేరాడు. ఇప్పుడు ఆ బాలుడు తన శరీరం కన్నా రెండు రెట్ల బరువును అవలీలగా ఎత్తి పడేస్తున్నాడు. 700 క్రంచ్‌లు చేయగలుగుతున్నాడు. కాజిన్‌యో ఉదయం 5.30 గంటలకే నిద్ర లేస్తాడు. 5 కిలోమీటర్లు పరుగెడతాడు. ఆ తర్వాత సిటప్స్‌ తీస్తాడు. పాఠశాల ఉన్నా లేకపోయినా ఆ బాలుడి దినచర్య రోజూ ఇలాగే సాగుతుంది. పాఠశాల నుంచి వచ్చిన వెంటనే హోమ్ వర్క్‌ పూర్తి చేసుకుంటాడు. వెంటనే జిమ్‌కి వెళ్లిపోతాడు. రోజూ రెండున్నర గంటలపాటు కసరత్తు చేస్తాడు. కఠినమైన డెడ్‌ లిఫ్ట్స్‌, స్క్వాట్స్‌, బెంచ్‌ ప్రెసెస్స్‌, బైసెప్‌ కర్ల్స్‌ లాంటి వ్యాయామాలు సాధన చేస్తాడు.

తన వయసులోని పిల్లలకు సాధ్యం కాని పనులన్నీ కాజిన్‌యో అవలీలగా చేయడంతో తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించారు. ఆ బాలుడు అథ్లెట్‌గా కచ్చితంగా రాణిస్తాడనే నమ్మకంతో ఉన్నారు. అందుకే అతడి కోసం కోచ్‌, డాక్టర్‌, ఫిజియో థెరపిస్ట్‌, న్యూట్రిషియన్‌ను నియమించారు. కాజిన్‌యో కసరత్తుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలు చూసిన వారు కాజిన్‌యో నెటో బ్రెజిలియన్‌ క్రాస్‌ఫిట్‌ అవుతాడని కామెంట్లు పెడుతున్నారు.


కాజిన్‌యో తొలిసారి జిమ్ కు వెళ్లినప్పుడు 1.34 మీటర్ల ఎత్తు , 33 కేజీల బరువు ఉన్నాడు. ప్రస్తుతం ఎత్తు 1.47 మీటర్లు , బరువు 38 కేజీలకు పెరిగింది. ఈ బ్రెజిల్‌ బాలుడిపై విదేశీ మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. దీంతో చిన్న వయసులోనే మితిమీరిన బరువులు ఎత్తడం మంచిది కాదని కొందరు సూచించారు. ఎక్కువ బరువులు ఎత్తడం, కండరాలు పెంచడం వల్ల ఎముకలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అభిప్రాయాలను కాజిన్‌యో తల్లిదండ్రులు కొట్టిపడేశారు. పూర్తిగా నిపుణుల పర్యవేక్షణలోనే తమ కొడుకుకు శిక్షణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. కాజిన్‌యో డైట్‌లో పెరుగుదల హార్మోన్లు లేవని, నిపుణుల సలహా మేరకు క్రియేటైన్‌, ఒమేగా-3 మాత్రమే ఇస్తున్నామని తెలిపారు. మొత్తంమీద 12 ఏళ్ల వయస్సుకే 6 ప్యాక్ సాధించి ఈ బాలుడు ఔరా అనిపించాడు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×