అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యయత్నం ఘటనపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర ఖండించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. హత్యాయత్నం లాంటి ఘటన జరగడం.. చాలా బాధాకరమని.. రాజకీయాల్లో, ప్రజాస్వమ్య వ్యవస్థలో హింసకు తావులేదని చెప్పారు.
Trump Assassination Attempt: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యయత్నం ఘటనపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర ఖండించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. హత్యాయత్నం లాంటి ఘటన జరగడం.. చాలా బాధాకరమని.. రాజకీయాల్లో, ప్రజాస్వమ్య వ్యవస్థలో హింసకు తావులేదని చెప్పారు. ఈ హింసాత్మక ఘటనలో గాయపడిన వారికి సానుభూతి తెలుపుతూ.. అమెరికా ప్రజలు ఈ షాక్ నుంచి త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నానని అన్నారు.
”నా స్నేహితుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడి జరగడం చాలా బాధాకరం. ఈ ఘటనని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఘటనలో చనిపోయిన, గాయపడిన వారి కుటుంబాల కోసం, అమెరికా ప్రజల కోసం మేము ప్రార్థిస్తున్నాము.” అని ప్రధాని మోదీ ట్వట్టర్-xలో పోస్టు చేశారు.
Deeply concerned by the attack on my friend, former President Donald Trump. Strongly condemn the incident. Violence has no place in politics and democracies. Wish him speedy recovery.
Our thoughts and prayers are with the family of the deceased, those injured and the American…
— Narendra Modi (@narendramodi) July 14, 2024
ట్రంప్‌పై హత్యయత్నాన్ని ఖండించిన ప్రెసిడెంట్ బైడెన్
ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ పై హత్యయత్నం ఘటనపై అమెరికా అధ్యక్షడు జో బైడెన్ స్పందించారు. ట్రంపై పై జరిగిన దాడిని బైడెన్ ఖండించారు. ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రిలో ఉన్న ట్రంప్ తో మాట్లాడడానికి ఫోన్ చేశానని తెలిపారు.
Also Read: BJP: ఇక బీజేపీకి వరుస దెబ్బలు.. ఏపీకి ముందుంది మంచి కాలం!
“ఘటన తరువాత ట్రంప్ తో మాట్లాడడానికి నేను ప్రయత్నించాను. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఆయన క్షేమంగానే ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ఆయనతో మాట్లాడుతాను. ఫోన్ చేసి ఆయనతో మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తాను. అమెరికా ఇలాంటి హింసాత్మక ఘటనకు చోటు లేదు. ఇలాంటి ఘటనలకు ఎదుర్కొనేందుకు దేశమంతా ఒక్కటై పోరాడాలి. హింసాత్మక చర్యలకు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించలేము” అని బైడెన్ అన్నారు.
ట్రంప్ ను కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్లిన సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
హత్యాయత్నం ఎలా జరిగిందంటే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలో కార్యక్రమం నిర్వహిస్తుండగా.. పరిసరాల్లో ఓ బిల్డింగ్ పై నుంచి ఓ షూటర్ ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 78 ఏళ్ల ట్రంప్ కు బుల్లెట్ గాయమైంది. ట్రంప్ కుడి చెవిపై భాగాన్ని బుల్లెట్ తాకుతూ వెళ్లింది. ఆ తరువాత ప్రచారంలో పాల్గొన్న జనంలో ఒకరు కాల్పుల్లో మరణించాడు. ఇద్దరికి గాయలయ్యాయి.
Also Read: హత్యాయత్నం తరువాత ట్రంప్ స్పందన.. షూటర్‌ని కాల్చివేసిన సీక్రెట్ సర్వీస్!
కాల్పుల శబ్దాలు వినపడగానే రక్షణ సిబ్బంది.. వెంటనే ట్రంప్ చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేసి జాగ్రత్తగా ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన వెంటనే అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది.. దాడి చేసిన షూటర్‌ని కాల్చి చంపారు.
మరో రెండు రోజుల తరువాత మిల్ వాకీ నగరంలో రిపబ్లికన్ పార్టీ సమావేశాల్లో అధికారికంగా డొనాల్డ్ ట్రంప్ ను పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ సమయంలోనే ఇలాంటి ఘటన జరగడంతో హత్యాయత్నం ఘటన అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారింది.