BigTV English

Brij Bhushan : రెజ్లర్ల ఆందోళన ఎఫెక్ట్.. బ్రిజ్ భూషణ్ ఇంటికి ఢిల్లీ పోలీసులు.. నెక్ట్స్ ఏంటి..?

Brij Bhushan : రెజ్లర్ల ఆందోళన ఎఫెక్ట్.. బ్రిజ్ భూషణ్ ఇంటికి ఢిల్లీ పోలీసులు.. నెక్ట్స్ ఏంటి..?


Brij Bhushan Singh latest news(Telugu breaking news today) : బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌ ఇంటికి ఢిల్లీ పోలీసులు వెళ్లారు. విచారణ కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ గోండాలోని ఆయన ఇంటివద్దకు వెళ్లారని సమాచారం. రెజ్లర్లు చేసిన ఆరోపణలపై 12 మంది వాంగ్మూలం నమోదు చేశారు. బ్రిజ్‌భూషణ్‌ మద్దతుదారుల్లో కొందర్నీ ప్రశ్నించారు. ఎంపీని ప్రశ్నించిన విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. ఈ కేసును విచారణ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటివరకు 137 మంది వాంగ్మూలాలను నమోదు చేసింది.

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రెజ్లర్లు ఆరోపించారు. ఈ క్రమంలోనే కొన్నిరోజులుగా ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుతో బ్రిజ్ భూషణ్ పై మొదటి ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మరో మైనర్‌ రెజ్లర్‌ తండ్రి ఫిర్యాదుతో రెండో ఎఫ్‌ఐఆర్‌ ఏప్రిల్‌ 28న నమోదైంది. మైనర్ కేసు నిరూపితమైతే పోక్సో చట్టం కింద ఆయనకు ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడుతుందని న్యాయనిపుణులు అంటున్నారు. అయితే మైనర్‌ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయంలో ఢిల్లీ పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు.


చాలారోజులుగా ఆందోళనల్లో పాల్గొన్న రెజ్లర్లు సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌ సోమవారం రైల్వేలో తిరిగి విధుల్లో చేరారు. ఇటీవల రెజ్లర్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత రెండురోజుల్లోనే ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. మరోవైపు రెజ్లర్లు ఆందోళన విరమించారని ప్రచారంపై జరుగుతోంది. అయితే న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో వెనక్కి తగ్గేదేలేదని సాక్షిమాలిక్‌ వివరణ ఇచ్చారు. సత్యాగ్రహంతోపాటే రైల్వేలో తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాని తెలిపారు. బీజేపీ విషయంలో ఢిల్లీ పోలీసులు నెక్ట్స్ స్టెప్ ఏంటి ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Tags

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×