BigTV English

Budget Promises : భవిష్యత్ కు భరోసా.. కేంద్ర ఇచ్చిన కొత్త హామీలివే..!

Budget Promises : భవిష్యత్ కు భరోసా.. కేంద్ర ఇచ్చిన కొత్త హామీలివే..!
Political news telugu

Union budget 2024 live updates(Political news telugu):

భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్య ఇస్తామన్నారు. జిల్లాలు, బ్లాక్‌ల అభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నామన్నారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంత ఇంటి కలను నిజం చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్‌ యోజన కింద 2 కోట్ల ఇళ్ల నిర్మిస్తామన్నారు.


ఆశాలు, అంగన్‌వాడీలకు ఆయుష్మాన్‌ పథకం వర్తింపచేస్తామన్నారు. 9-18 ఏళ్ల బాలికలు సర్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మరిన్ని మెడికల్‌ కాలేజీల కోసం కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.దేశంలో కొత్తగా ఐదు సమీకృత ఆక్వా పార్కులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

పాడి రైతుల ప్రోత్సాహానికి ప్రత్యేక సమగ్ర కార్యక్రమం చేపడతామని తెలిపారు. నానో యూరియా తర్వాత పంటలకు నానో డీఏపీ కింద ఎరువులు అందిస్తామని చెప్పారు. ఆయిల్‌ సీడ్స్‌ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తామన్నారు. స్వయం సహాయక బృందాల్లో కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారని తెలిపారు. లక్‌ పతీ దీదీ టార్గెట్‌ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంచుతున్నామన్నారు. పరిశోధన, సృజనాత్మకతకు రూ.లక్షల కోట్ల నిధి ఏర్పాటు చేస్తామన్నారు.
మౌలిక వసతుల రంగం 11.1 శాతం వృద్ధితో రూ.11లక్షల 11 వేల 111 కోట్ల కేటాయిస్తామన్నారు.


దేశ తూర్పు ప్రాంతాన్ని కొత్త అభివృద్ధి రథంగా మారుస్తున్నామన్నారు. డెమోగ్రఫీ, డెమోక్రసీ, డైవర్సిటీ మూల సూత్రాలుగా భారత్‌ ముందడుగు వేస్తోందన్నారు. 2047 నాటికి ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు. అవకాశాల సృష్టితో ఆకాశమే హద్దుగా భారత్‌ ముందడుగు వేస్తోందన్నారు.
కొత్త ప్రపంచంతో అనుసంధానమవుతూ భారత్‌ దిక్సూచిగా నిలబడుతోందని తెలిపారు.
విద్యుత్‌ బిల్లుల నుంచి విముక్తికి కొత్త సోలార్‌ పథకం ప్రకటించామన్నారు.

పిల్లల ఆరోగ్యం కోసం ఇంధ్రధనుస్సు కార్యక్రమం చేపడతామన్నారు.భారత్‌ నుంచి మధ్య ప్రాచ్యం మీదుగా యూరప్‌నకు ప్రత్యేక కారికాడర్‌ నిర్మిస్తామన్నారు. మౌలిక వసతుల రంగానికి రూ.11.11 లక్షల కోట్లు కేటాయిస్తున్నామన్నారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×