Big Stories

Rooftop solar scheme: సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుకు భారీ సబ్సిడీ.. పీఎం సూర్యఘర్ స్కీమ్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

Rooftop solar scheme

- Advertisement -

PM Surya Ghar Muft Bijli Yojana(Today news paper telugu): పీఎం సూర్యఘర్‌ పథకం అమలు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూఫ్‌ టాప్‌ సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే ఆయా ఫ్యామిలీకి కేంద్ర నుంచి సబ్బిడీ అందుతుంది. ఒక్కో కుటుంబానికి 78 వేల వరకు అందిస్తారు.

- Advertisement -

సౌర విద్యుత్‌ వినియోగం మరింత పెంచాలన్న లక్ష్యంతో పీఎం సూర్య ఘర్ పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. సామాన్యులపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గించాలని ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ పథకం అమలు చేయడగానికి కేబినెట్ ఆమోదంతో మరో అడుగు ముందుకు పడింది.

పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజనకు కేంద్ర మంత్రివర్గం గురువారం పచ్చజెండా ఊపింది. దీని ద్వారా కోటి ఇళ్లకు నెలానెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తారు. రూ.75,021 కోట్లతో రూఫ్‌టాప్‌ సోలార్‌ స్కీమ్‌ కు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రకటించారు. 2025 నాటికి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోనూ  రూఫ్‌ టాప్‌ సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వివరించారు.

సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు ప్రభుత్వ వైబ్ సైట్ లో దరఖాస్తులు చేసుకోవాలి.  గృహ వినియోగదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.

Read More: ప్రభుత్వ నియామకాల్లో ఇద్దరు పిల్లల నిబంధన.. సమర్ధంచిన సుప్రీంకోర్టు

ఇటీవల కేంద్ర పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ స్కీమ్ కు కేటాయింపులు చేసింది. ఫిబ్రవరి 13న ప్రధాని నరేంద్ర మోదీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకునేవారికి కిలోవాట్‌ సోలార్‌ ప్యానళ్లకు రూ.30 వేల సబ్సిడీ వస్తుంది. బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. 2 కిలోవాట్‌లకు రూ.60 వేలు, 3 అంతకంటే ఎక్కువ కిలోవాట్లకు రూ.78 వేలు రాయితీగా అందిస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News