BigTV English

Gaami Trailer : ఒక విచిత్ర వ్యాధి.. మూఢ నమ్మకం.. పరిశోధన.. కలయికే “గామి”!

Gaami Trailer : ఒక విచిత్ర వ్యాధి.. మూఢ నమ్మకం.. పరిశోధన.. కలయికే “గామి”!

 


Gaami Trailer

Gaami Trailer: విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన గామి మూవీ ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని పెంచేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ , టీజర్ ఈ మూవీపై అంచనాలు పెంచేశాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ అంచనాలు మరింత పెంచేలా ఉంది.


అఘోరా గెటప్ లో విశ్వక్ సేన్ అద్భుతంగా నటించాడని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా ఎ సస్పెన్ష్ హర్రర్ థ్రిల్లర్ గా ఉంటుందని ట్రైలర్ ద్వారా చెప్పకనే చెప్పారు. ఓవరాల్ గా కథ ఏంటో మాత్రం రివీల్ చేయలేదు. ఒక విచిత్ర వ్యాధి ఉన్న వ్యక్తి చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని ట్రైలర్ లోని సీన్స్ చెబుతున్నాయి.

విశ్వక్ పాత్ర ఎంతో ఆసక్తిని రేపుతోంది. అతడు అఘోరా గెటప్‌లో ఉన్నాడు. అతనికి మానవ స్పర్శ అంటే ఎందుకు భయం? అతని జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది? హీరోయిన్ పాత్రకు విశ్వసేన్ పాత్రకు మధ్య సంబంధం ఏంటి ? ఇలాంటి అంశాలను ట్రైలర్ లో ఎక్కడా రివీల్ చేయలేదు. మొత్తంగా చూస్తే  విచిత్ర వ్యాధి, మూఢనమ్మకం, పరిశోధన ఈ మూడు అంశాల చుట్టూ కథనం నడుస్తుందని అర్థమవుతోంది.

Read More: దృశ్యం చిత్రానికి మరో ఘనత.. హాలీవుడ్‌లో రీమేక్‌ కానున్న తొలి భారతీయ సినిమా..

గామి మూవీకి విధ్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. వి సెల్యులాయిడ్ పతాకంపై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. నరేశ్‌ కుమారన్‌ ఈ మూవీకి సంగీతం అందించారు. విశ్వనాథ్‌ రెడ్డి ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. ఆయన కెమెరా పనితనం అద్భుతంగా ఉందని ట్రైలర్ స్పష్టంచేస్తోంది.

గామీ మూవీని విజువల్ వండర్ గా తీర్చిదిద్దే ప్రయత్నం జరిగింది. గ్రాఫిక్స్ అదిరిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ రప్పించేలా ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×