BigTV English

Largest Pumpkin: వామ్మో..గుమ్మడికాయ.. ఎంత బరువు ఉందో తెలుసా?

Largest Pumpkin: వామ్మో..గుమ్మడికాయ.. ఎంత బరువు ఉందో తెలుసా?

Largest Pumpkin: ఒకటీ.. అరా.. కాదు. ఏకంగా 1247 కిలోలు! అంతటి భారీ గుమ్మడికాయను ఎవరూ చూసి ఉండకపోవచ్చు. మిన్నెసోటాకు చెందిన హార్టికల్చర్ టీచర్ ట్రావిస్ గ్యాంగర్‌ భారీ సైజు గుమ్మడికాయలను అలవోకగా పండించేయగలరు.


కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే సిటీలో(Half Moon Bay Pumpkin Festival) జరిగిన 50వ ప్రపంచ పోటీల్లో అత్యంత బరువున్న గుమ్మడికాయను ప్రదర్శించారు. ఆ భారీ గుమ్మడికాయను చూసి అందరూ ఔరా అని ముక్కున వేలేసుకున్నారు.

దానిని కోస్తే 687 ముక్కలు చేయొచ్చట. ట్రావిస్ గత 30 ఏళ్లుగా గుమ్మడికాయలను పెంచుతున్నారు. అతి భారీ గుమ్మడికి సంబంధించిన గిన్నిస్ రికార్డు ఇప్పటివరకు ఇటలీ రైతు పేరిట ఉండేది. 1226 కిలోల బరువు రికార్డును ట్రావిస్ ఇప్పుడు బద్దలు కొట్టేశాడు. 30 వేల డాలర్ల బహుమతిని దక్కించుకున్నాడు.


భారీ గుమ్మడికాయల సాగులో 2020, 2022 లోనూ అతనే విజేత. సొంత పెరడులోనే ఆ గుమ్మడికాయను పండించడం మరో విశేషం. ట్రావిస్ తండ్రి గుమ్మడికాయలను సాగు చేస్తుండేవారు. అదే స్ఫూర్తితో టీనేజర్ నుంచి గుమ్మడి సాగుపై ఆసక్తి పెంచుకున్నాడు ట్రావిస్.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×