E-Paper
Advertisement

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్
Advertisement

CBSE OSM Row: సీబీఎస్ఈ ఓఎస్ఎం వ్యవహారం సెగ తీవ్రమవుతోంది. ఈ విషయంలో కేంద్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కేవలం ఇద్దరు అధికారులను బదిలీ చేసినంత మాత్రాన ఇష్యూ ఆగిపోదని, దీనికి సంబంధించి హెచ్ఆర్డీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు- విద్యార్థుల తల్లిదండ్రులు.

ఈ వ్యవహారంపై నోరు విప్పారు కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్. ఉన్నతాధికారులు బదిలీ, విచారణకు ఆదేశించిన మాత్రం సమస్య సమసిపోదని, జవాబుదారీపై పలు ప్రశ్నలు ఆయన లేవనెత్తారు. ఈ యవ్వారంలో చిన్న చేపలను నిందించడం, పెద్దవారిని రక్షించారని విరుచుకుపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రితోపాటు ఉన్నతాధికారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

కేవలం సీబీఎస్ఈ అధికారులపై బాధ్యతను మోపుతున్నట్లు కనిపిస్తోందన్నారు. బుధవారం ఆయన ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు లేవనెత్తారు. జరిగిన అవకతవకల వెనుక ఎలాంటి విచారణ జరగదని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పిలుపు నిచ్చారు. సీబీఐ-ఈడీ ఎక్కడ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు.

సీబీఎస్ఈ బోర్డు ఆన్ స్క్రీన్ మార్కింగ్ వ్యవస్థకు సంబంధించి ఏకసభ్య విచారణకు ఏర్పాటు చేసిన కొద్దిసేపటికి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కమిషన్ ఛైర్ పర్సన్ రాధ చౌహాన్ ఈ విచారణకు నేతృత్వం వహించనున్నారు. ఓఎస్ఎం వ్యవస్థకు సంబంధించిన విషయాలను పరిశీలించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది. విచారణలో అన్ని విభాగాల నుంచి అధికారుల సహకారం తీసుకునే అధికారాన్ని ఆయనకు కల్పించింది ప్రభుత్వం.

Advertisement

మరోవైపు సీబీఎస్ఈ బోర్డు చైర్మన్ రాహుల్ సింగ్, సెక్రటరీ హిమాన్షు గుప్తాలను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది.విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరిస్తామని, దిద్దుబాటు చర్యలు చేపడతామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థుల సమాధాన పత్రాల పరిశీలన, పునర్‌ మూల్యాంకనాలకు దరఖాస్తు చేసుకునేందుకు పోర్టల్ ఓపెన్ అయ్యింది. ‌

ALSO READ: తమిళనాడు రాజకీయాలు కొత్త మలుపు, బీజేపీకి  అన్నామలై రాజీనామా

తెరుచుకుంది. క్షణాల వ్యవధిలో సైబర్‌ దాడి జరిగిందని సీబీఎస్ఈ వెల్లడించింది. ఆ దాడుల్ని తట్టుకుని పోర్టల్‌ పని చేస్తోందని తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు గంటలకు 18వేలకు పైగా పునర్‌ మూల్యాంకన, పరిశీలన దరఖాస్తులను ప్రాసెస్‌ చేసిందని వెల్లడించింది. ఈ పోర్టల్ ఈ నెల 6 వరకు తెరచి ఉంటుంది.

 

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×