BigTV English

Chandrayaan -3 latest update : తుది కక్ష్యలోని చంద్రయాన్ -3.. ఆ రోజే చంద్రుడిపై ల్యాండర్ దిగే ఛాన్స్..

Chandrayaan -3 latest update : తుది కక్ష్యలోని చంద్రయాన్ -3.. ఆ రోజే చంద్రుడిపై ల్యాండర్ దిగే ఛాన్స్..
Chandrayaan 3 live status today

Chandrayaan 3 live status today(Telugu flash news) :

చంద్రయాన్‌-3 లక్ష్యం దిశగా సాగుతోంది. చంద్రుడి ఉపరితలంపై దిగే సమయం దగ్గర పడింది. మరో వారం రోజుల్లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కారం కానుంది. బుధవారం చంద్రుడి చివరి కక్ష్యలోకి చంద్రయాన్ -3 ప్రవేశించింది.


చంద్రయాన్‌-3 కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని మరోసారి విజయవంతంగా చేపట్టామని ఇస్రో స్పష్టం చేసింది. తాజా చర్యతో కక్ష్య తగ్గింపు ప్రక్రియలు పూర్తయ్యాయని వెల్లడించింది. చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టేందుకు ఇదే చివరి కక్ష్య అని పేర్కొంది. తాజాగా వ్యోమనౌక కక్ష్యను 153 km x 163 km లకు తగ్గించామని వివరించింది. దీంతో ఇప్పుడు చంద్రయాన్-3 జాబిల్లిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి ప్రవేశించింది.

ఇప్పటివరకు చంద్రయాన్-3 దశలన్నీ విజయవంతమయ్యాయి. వ్యోమనౌకలోకి ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండింగ్‌ మాడ్యూల్‌ విడిపోయే ప్రక్రియను ఆగస్టు 17న నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ సజావుగా సాగితే ల్యాండింగ్‌ మాడ్యూల్‌ విడిపోయి చంద్రుడిని చుట్టేస్తుంది. ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెడుతుందని ఇస్రో ప్రకటించింది.


చంద్రయాన్‌-3ను జులై 14న MVM3-M4 రాకెట్‌ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రోజు తొలిసారి కక్ష్యను పెంచారు. దశలవారీగా 18 రోజుల వ్యవధిలో 5సార్లు కక్ష్యను పెంచారు. 5వ భూకక్ష్య పూర్తైన తర్వాత చంద్రుడి దిశగా ప్రయాణించే ప్రక్రియను చేపట్టారు. ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్యలోకి చంద్రయాన్ -3 ఆగస్టు 1న ప్రవేశపెట్టారు. అక్కడ నుంచి ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ జాబిల్లికి చేరువగా పంపారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×