Kuno National Park : ఆగని చీతాల మరణాలు.. మరో రెండు కూనల మృత్యువాత..

Kuno National Park : ఆగని చీతాల మరణాలు.. మరో రెండు కూనల మృత్యువాత..

cheetah cub dies at kuno national park
Share this post with your friends

Kuno National Park : భారత్ చేపట్టిన చీతాల ప్రాజెక్టుకు పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు మొత్తం 20 చీతాలు తీసుకొచ్చారు. వాటిలో 3 ఇప్పటికే మృతిచెందాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓ చీతాకు నాలుగు కూనలు జన్మించాయి. వాటిలో ఇప్పటికే మూడు కూనలు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం ఓ చీతా కూన మృతిచెందింది. గురువారం మరో రెండు చీతా కూనలు ప్రాణాలు కోల్పోయినట్లు జూ అధికారులు ప్రకటించారు.

నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాల అనే చీతా రెండు నెలల క్రితమే 4 కూనలకు జన్మినిచ్చింది. కునో నేషనల్ పార్కు ప్రాంతంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి వాతావరణం వల్ల కూనలు నీరసించిపోయినట్లు పార్కు లో పర్యవేక్షకులు గుర్తించారు. పశువైద్యులు వాటికి చికిత్స అందించారు. అయినా సరే అవి కోలుకోలేదు. మంగళవారం ఒకటి, గురువారం రెండు కూనలు మృత్యువాతపడ్డాయి. ఇక ఒక చీతా కూన మాత్రమే ఉంది.

కునో పార్కులో చీతాలు స్వేచ్ఛగా సంచరించడానికి ఏర్పాట్లు చేయాలని దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన అటవీ జంతువుల నిపుణుడు విన్సెంట్‌ వాన్‌ డెర్‌ మెర్వే చెప్పారు.
కంచెలు నిర్మించాలని సూచించారు. ఈ ప్రాంతంలో ఇతర జంతువులు, మనుషుల సంచారాన్ని నివారించే చర్యలు చేపట్టాలన్నారు. లేకపోతే భవిష్యత్తులో మరిన్ని చీతాలు మృత్యువాత పడే అవకాశం ఉందని హెచ్చరించారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Ajit Agarkar : భారత్ క్రికెట్ సెలక్షన్ కమిటీకి కొత్త ఛైర్మన్ .. అజిత్ అగార్కర్ కు బాధ్యతలు..

Bigtv Digital

Ecuador vs Netherlands : బడా టీమ్ బేజార్.. చిన్న జట్టు హుషార్..

BigTv Desk

Victory Venkatesh : పాన్ ఇండియా వైపు వెంకీ.. ఎవరూ ట్రై చేయని రూట్

Bigtv Digital

TTD : టీటీడీ ఆస్తులు ఇవే!

BigTv Desk

Ram Charan: మెగా వారసురాలి పేరు ఫిక్స్.. ఉపాసన డిశ్చార్జ్.. పాప ఎవరి పోలికంటే..

Bigtv Digital

Bandi Sanjay: బండి ప్రజా సంగ్రామం.. బీజేపీ భరోసా యాత్ర.. జనంలో కమలదళం

BigTv Desk

Leave a Comment