Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లో భారీ వర్షాల బీభత్సం సృష్టిస్తున్నాయి. నిన్న వైషోదేవి గుడికి వెళ్లు మార్గంలో త్రికూట కొండ దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 30కి పెరిగింది. ఈ ప్రమాదంలో ముందుగా 9 మంది చనిపోగా.. ప్రస్తుతం మృతులసంఖ్య పెరిగింది. పదుల సంఖ్యలో భక్తులకు గాయాలు అయ్యాయి. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుక్కున్నట్లు తెలిపారు. దీంతో యాత్రను ఆపేసిన అధికారులు సహాయకచర్యలు కొనసాగిస్తున్నారు.
దశాబ్దకాలంలో అత్యధిక వర్షపాతం..
అయితే భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, హిమపాతం సంభవించే అవకాశంతో కూడిన తుఫానులు ఈ ప్రమాదానికి కారణమయ్యాయిని చెబుతున్నారు. జమ్మూ నగరంలో 20 గంటల్లో 250 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది, ఇది దశాబ్దకాలంలో అత్యధికం అని చెప్పారు. అలాగే చనిపోయిన బాధితుల్లో ఎక్కువ మంది యాత్రికులు ఉన్నారు. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు యువకులు యష్ గార్గ్, ప్రాంశు మిట్టల్, శివ్ బన్సాల్ మిస్సింగ్ అయ్యారు. డోడా జిల్లాలో నలుగురు మరణించారు.
శిథిలాలకింద చిక్కుకున్నా భక్తులు..
రెస్క్యూ ఆపరేషన్లు తీవ్రంగా సాగుతున్నాయి. జిల్లా అడ్మినిస్ట్రేషన్, జే&కే పోలీసు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఇండియన్ ఆర్మీ, స్థానిక వాలంటీర్లు సమన్వయంతో పనిచేస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జమ్మూ జిల్లాలో 3,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి, ఆహారం, నీరు, వైద్య సహాయం కూడా అందిస్తున్నారు.
ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ ఘటనను “అత్యంత విషాదకరం” అని పేర్కొన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను కూడా పంపుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడి, కేంద్ర సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. జమ్మూ డివిజన్‌లోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు ఆగస్టు 27న మూసివేశారు. యాత్రను పూర్తిగా నిలిపివేశారు.
Also Read: అల్పపీడనం ఎఫెక్ట్.. రాష్ట్రంలో మరో మూడు రోజులు కుండపోత వర్షాలు..
ఈ ప్రమాదం వల్ల జమ్మూ కశ్మీర్ అంతటా తీవ్ర ప్రభావం పడింది. చెనాబ్, తావి, ఉఝ్, రావి నదులు ప్రమాదకర స్థాయిని దాటాయి. బ్రిడ్జిలు కూలిపోయాయి..17 ఇళ్లు, మూడు బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయి. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి బ్లాక్ అయింది. మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు నిలిచిపోయాయి. 22 రైళ్లు రద్దు చేశారు, 27 రైళ్లు షార్ట్ టర్మినేట్ చేశారు. వాతావరణ నిపుణులు మరిన్ని భారీ వర్షాలు పడవచ్చని హెచ్చరించారు.
వైష్ణో దేవి యాత్రకు బ్రేక్..
భారీ వర్షాల నేపథ్యంలో విరిగిపడుతున్న కొండచరియలు
కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి, 14 మందికి గాయాలు https://t.co/obrXw187TR pic.twitter.com/dNtxnf8Hgy
— BIG TV Breaking News (@bigtvtelugu) August 26, 2025