Michael Clarke Cancer: ఆస్ట్రేలియా జట్టులో క్యాన్సర్ కలకలం. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ ఆస్ట్రేలియా మ్యాజిక్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ భయంకరమైన వ్యాధి బారిన పడ్డాడు. తాజాగా మైఖేల్ క్లార్క్ కు క్యాన్సర్ వచ్చినట్లు… అధికారిక ప్రకటన వెలువడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆయనకు స్కిన్ క్యాన్సర్ వచ్చినట్లు ప్రకటించారు. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఈ ప్రకటన చేయడంతో… క్రికెట్ అభిమానులు ఉలిక్కిపడుతున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
మైఖేల్ క్లార్క్ కు భయంకరమైన వ్యాధి
తాను చర్మ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను స్కిన్ కాన్సర్ తో బాధపడుతున్నానని.. ట్రీట్మెంట్ కోసం తన ముక్కు వద్ద కొంత చర్మాన్ని కూడా వైద్యులు కట్ చేసినట్లు ఎమోషనల్ అయ్యాడు మైఖేల్ క్లార్క్. వైద్యం కంటే నివారణ మేలు అని ఈ సందర్భంగా వెల్లడించాడు. కానీ నా విషయంలో రెగ్యులర్ చెకప్ చాలా కీలకమని ఎమోషనల్ పోస్టు కూడా పెట్టాడు మైకేల్ క్లార్క్. వాస్తవానికి 2006 సంవత్సరంలోనే క్యాన్సర్ ఉన్నట్లు మైకేల్ క్లార్క్ తాజాగా వెల్లడించారు.
అప్పుడే వైద్యులు తన హెల్త్ ప్రాబ్లం బయట పెట్టారని.. గుర్తు చేశారు. అప్పటినుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని.. ఇప్పుడు… ఆ క్యాన్సర్ మరింత ప్రమాదంగా మారిందని కూడా వెల్లడించాడు. దీంతో మైఖేల్ క్లాక్ పోస్టు వైరల్ గా మారింది. వెంటనే మైకేల్ క్లార్క్ కోలుకోవాలని ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులతో పాటు ఇండియన్ ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టును నడిపించిన మైఖేల్ క్లార్క్ ఇలాంటి ప్రమాదంలో పడడం చాలా దారుణమని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.
క్రికెట్ లో మైకేల్ క్లార్క్ అరుదైన రికార్డులు
క్రికెట్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్. మిడిల్ ఆర్డర్ లో వచ్చి.. ఆస్ట్రేలియాను ఎన్నో మ్యాచ్ లలో గెలిపించారు. ఇప్పటివరకు 115 టెస్టులు, 245 వన్డే మ్యాచులు ఆడాడు. 34 t20 లు మాత్రమే ఆడి రిటైర్మెంట్ తీసుకున్నాడు మైఖేల్ క్లార్క్. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా 6 మ్యాచుల్లో మాత్రమే మెరిశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్.
Former Australian skipper Michael Clarke has shared a post after undergoing surgery for skin cancer.
Wishing him a speedy recovery and good health ahead! 🙏#MichaelClarke #Australia #Cricket #Sportskeeda pic.twitter.com/4G1gZ2gjos
— Sportskeeda (@Sportskeeda) August 27, 2025