BigTV English

PM Modi: రంగంలోకి సుదర్శన చక్ర.. ఇక శత్రువులకు చుక్కలే!

PM Modi: రంగంలోకి సుదర్శన చక్ర.. ఇక శత్రువులకు చుక్కలే!

PM Modi: భారత్ జోలికి ఎవరు వచ్చినా ఖేల్ ఖతం చేయాలి.. దాడులు చేయాలనుకున్న వారిని తిప్పికొట్టాలి. ఏ మిసైల్ అయినా మన భూభాగంలోకి వస్తూనే మాడి మసైపోవాలి. ఇదే టార్గెట్ గా అడుగులు పడుతున్నాయ్. పంద్రాగస్టు రోజున ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోడీ మిషన్ సుదర్శన్ చక్ర ప్రకటించారు. 2035 నాటికి దేశంలోని కీలక ప్రాంతాలను రక్షించుకోవడమే లక్ష్యంగా అడుగులు పడబోతున్నాయ్. ఇంతకీ ఈ మిషన్ ను ఎలా ఆపరేట్ చేయబోతున్నారు?


2035 నాటికి మిషన్ సుదర్శన్ చక్ర యాక్టివేట్

చూశారుగా.. ప్రధాని మోడీ చెబుతున్న మాట. భగవాన్ శ్రీకృష్ణ మార్గంలో సుదర్శన చక్రాన్ని యాక్టివేట్ చేస్తామంటున్నారు. కథ మార్చేస్తామంటున్నారు. శత్రు సంహారం చేస్తామంటున్నారు. మనవైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా చేస్తామంటున్నారు. అందుకోసం మిషన్ సుదర్శన చక్రను తెరపైకి తీసుకొచ్చారు. 2035 నాటికి దేశంలోని కీలక ప్రాంతాలను అంటే హాస్పిటల్స్, పౌర ప్రాంతాలు, స్ట్రాటజిక్ లొకేషన్స్ ఇలాంటి వాటిని శత్రు క్షిపణుల నుంచి రక్షించడం దీని ఉద్దేశం. సో చెప్పాలంటే మన గగనతలం మరింత శత్రు దుర్బేధ్యం కాబోతోంది. శత్రు దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేయబోతోంది.


S-400 తో మన గగనతలం సేప్టీ

కొత్త తరం టెక్నాలజీతో దేశ ప్రజలకు రక్షణ, భరోసా కల్పించడమే మిషన్ సుదర్శన చక్ర ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం మన దగ్గర వద్ద మూడు S-400 లాంగ్-రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటిని రష్యా నుంచి కొనుగోలు చేశాం. మే నెలలో ఆపరేషన్ సిందూర్ టైంలో భారత్ కు చెందిన 15కి పైగా సిటీలపై పాక్ ప్రయోగించిన మిసైల్స్ ను మార్గమధ్యలోనే న్యూట్రలైజ్ చేసి పడేశాయి. S-400 గరిష్టంగా 400 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదిస్తుంది. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రాడార్ 600 కిలోమీటర్ల దూరంలోని ఎయిర్ స్ట్రైక్స్ ను గుర్తించి అడ్డుకుంటుంది. ప్రస్తుతం AI జమానాలో యుద్ధాలు ఎలా మారిపోయాయంటే.. శత్రు దేశాల సైనికులు మనదేశ భూభాగంలోకి చొరబడి యుద్ధం చేసే పరిస్థితి లేదు. అందుకే ఏ దేశాల మధ్య యుద్ధాలు జరిగినా ఎక్కువగా ఎయిర్ స్ట్రైక్సే ఉంటాయి. అందుకే ఏ దేశమైన వారి గగనతలాన్ని కాపాడుకునే పనిలో ఉంటాయి. రివర్స్ ఎటాక్స్ చేస్తాయి. మన దగ్గర ఉన్న ఈ 3 S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ భవిష్యత్ యుద్ధ అవసరాలకు సరిపోవు. అందుకే భారత్ S – 500 కొనుగోలు కోసం రష్యాతో సంప్రదింపులు మొదలు పెట్టింది కూడా. ఇది S -400తో పోలిస్తే మరింత ఎఫెక్టివ్ అన్న మాట. ఇది వస్తే బాహుబలి 2 అవుతుంది. దీన్ని ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ లో సుదర్శన చక్రగా పిలుస్తున్నారు. అయితే మోడీ ప్రతిపాదించిన మిషన్ సుదర్శన చక్ర యావత్ దేశాన్నే కాపాడే మల్టీ లేయర్డ్ ప్రొటెక్షన్ షీల్డ్ అన్న మాట.

ఆపరేషన్ సిందూర్ IACCS సత్తా

సుదర్శన్ చక్ర మిషన్‌ మనదేశ జనాన్ని అలాగే కీలకమైన ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ ను శత్రు దాడుల నుండి రక్షించడానికి అధునాతన నిఘా, సైబర్ సెక్యూరిటీ, ఫిజికల్ గా సేఫ్టీ కలిగించే ఫ్రేమ్ వర్క్. ఆపరేషన్ సిందూర్ లో ఏకంగా 100 గంటల పాటు పాకిస్తాన్ క్షిపణి ప్రయత్నాలను న్యూట్రలైజ్ చేయడం ద్వారా తన పరాక్రమాన్ని ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ – IACCS నిరూపించుకుంది. ఇది సక్సెస్ ఫుల్ గా తన సమర్థతను చాటుకుంది. IACCS అన్నది ఎయిర్ డిఫెన్స్ కోసం స్ట్రాటజిక్ కమాండింగ్ నెట్ వర్క్. దీన్ని డీల్ చేస్తూనే.. మిషన్ సుదర్శన చక్ర పేరుతో మరింత సమగ్రమైన కవచాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది భారత్. శత్రు దేశాల దాడులను ఎదుర్కోవడమే కాదు.. ఎదురు దాడి చేయడానికి భారత్ తన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను రంగంలోకి దింపుతుంది. 500 కిలోమీటర్ల ఎటాక్ రేంజ్ ను కలిగి ఉన్న ప్రళయ్, నిర్భయ్ అలాగే బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి వంటి వాటిని ప్రయోగించే అవకాశం ఉంది. IACCS ను మరింత అప్డేట్ చేయడంతో మిషన్ సుదర్శన చక్ర డిఫెన్స్ సిస్టమ్ ను డెవలప్ చేసే ఛాన్స్ ఉంది. అమెరికాకు కొత్తగా గోల్డెన్ డోమ్ వస్తోంది. ఇజ్రాయెల్ కు ఇప్పటికే ఐరన్ డోమ్ ఉంది. మరి మనకూ ఓ డోమ్ కావాల్సిందే. ఇటు పాకిస్థాన్, అటు చైనా.. కాసుక్కూచున్నాయి. మరి వీళ్లందరినీ ఎదుర్కోవాలంటే పకడ్బందీ వ్యూహాలు అవసరం. అందుకే మిషన్ సుదర్శన చక్ర తెరపైకి వచ్చింది.

ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌కు 90 శాతం సక్సెస్ రేటు

భారత్ అనుకుంటున్న మిషన్ సుదర్శ చక్ర లక్ష్యం నెరవేరితే.. అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కలిగి ఉన్న ఇజ్రాయెల్ వంటి దేశాల సరసన చేరవచ్చు. ఇజ్రాయెల్ కు కీలకమైన ఐరన్ డోమ్ ఉంది. ఇది క్షిపణి లాంఛర్ నుంచి 4 నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో దూసుకొచ్చే స్వల్ప శ్రేణి మిసైల్స్ ను, మోర్టార్ షెల్స్ ను అడ్డుకుంటుంది. 2011 నుంచి ఇజ్రాయెల్ కు ఈ ఐరన్ డోమ్ పని చేస్తోంది. వీటికి 90 శాతం సక్సెస్ రేటు ఉందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు అంటున్న మాట. అమెరికా మొత్తాన్ని కవర్ చేసేలా ట్రంప్ గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేసుకుంటామని గతంలోనే ప్రతిపాదించారు. ఈ మిషన్ కు ఏకంగా 175 బిలియన్ డాలర్లు అవసరమవుతాయి. ఈ ప్రాజెక్ట్ తో భూమి, సముద్రం, స్పేస్ ఇలా ఎక్కడి నుంచి మిసైల్స్ వచ్చినా ముప్పును ఎదుర్కొంటాయి. అడ్డుకుంటాయి. న్యూట్రలైజ్ చేస్తాయి. ఇప్పటికే రష్యాకు తన రాజధాని మాస్కో ఇతర ప్రధాన నగరాలను కాపాడుకునేలా A-135 యాంటీ బాలిస్టిక్ డిఫెన్సివ్ సిస్టమ్ ను కలిగి ఉంది. మధ్యస్థ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోగల S-400 కూడా ఉంది. అటు చైనా కూడా విభిన్న శ్రేణి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కలిగి ఉంది. పాకిస్తాన్ కూడా దేశీయంగా ఉత్పత్తి చేసుకున్న అలాగే దిగుమతి చేసుకున్న ఎక్విప్ మెంట్స్ తో టైర్డ్ వ్యవస్థను కలిగి ఉంది. అయితే అదంత ఎఫెక్టివ్ కాదు. మన మిసైల్స్ ను పాక్ డిఫెన్స్ సిస్టమ్ ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. అందుకే మనం పాక్ ఎయిర్ బేస్ లను ఈజీగా టార్గెట్ చేయగలిగాం.

2014లో భారత డిఫెన్స్ బడ్జెట్ 2.53 లక్షల కోట్లు

భారత్ కు 2014లో డిఫెన్స్ బడ్జెట్‌ 2.53 లక్షల కోట్లుగా ఉండేది. కానీ ప్రస్తుతం అది 6.81 లక్షల కోట్లకు పెంచుకుంది. మారుతున్న కాలానికి, పెరుగుతున్న థ్రెట్స్ తో తప్పదు. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – సిప్రి రిలీజ్ చేసిన 2024 డేటా ప్రకారం డిఫెన్స్ సెక్టార్ కు ఎక్కువ ఖర్చు చేసే దేశాల్లో భారత్ ఐదో అతిపెద్ద దేశంగా ఉంది. 86 బిలియన్ డాలర్లు వ్యయం చేస్తోంది. ఇది పాకిస్తాన్ కంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువ. అదే సమయంలో చైనా తన డిఫెన్స్ కోసం 314 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది. బడ్జెట్ కేటాయింపుల పరంగా ఇటీవలి సంవత్సరాల్లో వార్షిక పెరుగుదలను నమోదు చేసినప్పటికీ, GDPలో రక్షణ వ్యయం ఇప్పటికీ 1.9 శాతం వద్దే చాలా తక్కువగా ఉంది. నిజానికి జీడీపీలో 3 శాతం రక్షణ అవసరాలకు కేటాయించాలన్న సిఫార్సులు ఉన్నాయి. జీడీపీ పరంగా చూస్తే.. రక్షణరంగానికి ఎక్కువ ఖర్చు చేసే దేశాల్లో US ఫస్ట్ ప్లేస్ లో ఉంది. దాని GDPలో 3.2 శాతం రక్షణ అవసరాలకు కేటాయిస్తుంది. మన దగ్గర మిషన్ సుదర్శన చక్ర పట్టాలెక్కాలంటే.. మొత్తం 15 నుంచి 20 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయన్న అంచనాలు ఉన్నాయి. అలాగే.. ఏటా ఈ సిస్టమ్ మెయింటెనెన్స్ ఖర్చులు 3 బిలియన్ డాలర్లుగా ఉంటాంటున్నారు.

మిషన్ సుదర్శన చక్రతో దేశీయ కంపెనీలకు బూస్టప్

ఈ కొత్త ప్రాజెక్టులో దేశీయ కంపెనీలకు చాలా బూస్టప్ రాబోతోంది. ఇందులో టాప్ సైంటిఫిక్, డిఫెన్స్ సెక్టార్ కంపెనీలు, అలాగే ప్రైవేట్ రంగానికి చెందిన ఇన్నోవేటర్స్ ఇన్వాల్వ్ మెంట్ ఉండబోతోంది. మేకిన్ ఇండియా స్వావలంబనతో ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కబోతోంది. అన్ని రకాల దాడులు ఇంక్లూడ్ సైబర్ థ్రెట్స్ ను కూడా ఎదుర్కొనేలా రెడీ కాబోతోంది మిషన్ సుదర్శన చక్ర. రష్యాతో జాయింట్ వెంచర్ అయిన బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ ఇప్పుడు ఎక్కువగా దేశీయంగానే ముందుకెళ్తోంది. SIPRI రిపోర్ట్ ప్రకారం, ఉక్రెయిన్ తర్వాత రెండవ అతిపెద్ద ఆయుధాల దిగుమతి చేసుకునేది భారతే. ఈ సమస్యలను తగ్గించడం కూడా సవాల్ గా ఉంది. అదే సమయంలో దేశమంతా రక్షణ కవచం ఏర్పాటు చేయడం కష్టమని కొందరు డిఫెన్స్ ఎక్స్ పర్ట్స్ వాదిస్తున్నారు. అసాధ్యమంటున్నారు. ఆచరణ సాధ్యం కాదంటున్నారు. మెయింటెనెన్స్ ఎక్కువంటున్నారు. కో ఆర్డినేషన్ కష్టమంటున్నారు. అయితే వీటన్నిటిని అధిగమించేలా ప్లాన్స్ ఉంటాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

ప్రళయ్, నిర్భయ్, బ్రహ్మోస్‌తో కౌంటర్ ఎటాక్

అయితే మిషన్ సుదర్శన చక్ర.. డ్రోన్‌లు, క్రూయిజ్ మిస్సైల్‌లు, బాలిస్టిక్ మిస్సైల్స్ ను న్యూట్రలైజ్ చేసే కెపాసిటీతో ఉంటాయి. ఆపరేషన్ సిందూర్ తో ఒక విషయమైతే క్లియర్ అయింది. మన గగనతలాన్ని కాపాడుకోవడమే కాదు.. ప్రళయ్, నిర్భయ్, బ్రహ్మోస్ వంటి మిస్సైల్స్ తో కౌంటర్ ఎటాక్ కూడా చేస్తారు. దీంతో మన రక్షణ శక్తి ఏంటో అందరికీ తెలుస్తుంది. శత్రువుకు భయం పుట్టిస్తుందంటున్నారు. అలాగే సుదర్శన చక్ర కంప్లీట్ అయితే దక్షిణాసియాలో, ఇండో పసిఫిక్ రీజియన్ లో రాజకీయ ఆధిపత్యాన్ని బలోపేతం చేస్తుంది. పాకిస్తాన్, చైనా వంటి సమీప శత్రువులపై ఒత్తిడిని పెంచుతుంది.

Also Read: కాళ్లు, చేతులు, తల లేకుండానే స్వాతి అంత్యక్రియలు..

మిషన్ సుదర్శన చక్రకు 15-20 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరం, ఏటా 3 బిలియన్ డాలర్ల ఆపరేటింగ్ ఖర్చు ఉన్నా.. ఇది రక్షణ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచుతుంది. AI, లేజర్ వెపన్స్, డ్రోన్ డిటెక్షన్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తుంది. భారత యువతను డిఫెన్స్ సెక్టార్ రీసెర్చ్ లో స్కిల్స్ పెంచుకునేలా చేస్తుంది. ప్రైవేట్ రంగ సంస్థలకు మంచి అవకాశాలను అందిస్తుంది. పైగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రష్యా, ఇజ్రాయెల్ నుండి ఆయుధాల దిగుమతులను తగ్గిస్తుంది. మనీ ప్రవాహం స్థానిక ఆర్థిక వ్యవస్థలోనే తిరుగుతుంది. ఆపై ఆయుధాలు, క్షిపణుల ఎగుమతికి ఉపయోగపడుతుంది. అంటే దిగుమతి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారత్ వెళ్తుంది. ఇప్పటికే బ్రహ్మోస్ సహా కొన్ని రకాల క్షిపణులను పలు దేశాలకు భారత్ ఇప్పటికే ఎగుమతి చేస్తోంది కూడా. జీడీపీలో రక్షణ రంగానికి 3 శాతం ఖర్చు చేస్తే.. దీర్ఘకాలంలో డిఫెన్స్ ఇండస్ట్రీలో వృద్ధిని ప్రోత్సహిస్తుంది. సో ఫైనల్ గా ఒక బలమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ శత్రు దేశాలపై ఒత్తిడిని పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.

Story By Vidya Sagar, Bigtv

Related News

India Warning: పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇండియా.. ఈసారి వారి మంచి కోసమే, వాళ్లంతా సేఫ్!

CISF Women Commando: పురుషుల ఆధిపత్యానికి ఫుల్‌స్టాప్…. మహిళా కమాండోలు ఎంట్రీ!

Metro Fare Hikes: ప్రయాణికులకు షాక్.. సడన్‌గా చార్జీలు పెంచిన మెట్రో

Rahul Mamkootathil: సినీ నటి ఆరోపణలు.. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రాహుల్ సస్పెండ్

Heavy Rains: దేశాన్ని వణికిస్తున్న వాన బీభత్సం.. విద్యాసంస్థలకు సెలవులు

Big Stories

×