Hyderabad: నేడు వినాయక చవిత సందర్భంగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించుకోడానికి ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు తరలి వస్తుంటారు. అలాగే ఈ సారి గణేషుడిని చూడటానికి వచ్చారు. అయితే గణేష్ దర్శనానికి వచ్చిన ఓ మహిళ క్యూ లైన్లో ప్రసవించింది. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
Also Read: ట్రంప్ టారిఫ్ స్టార్ట్! భారత్‌కు కలిగే నష్టాలు ఇవే..
గణేష్ క్యూలైన్లో ప్రసవించిన మహిళ
అయితే ఆ మహిళను అక్కడి స్థానికులు వెంటనే పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. ప్రసవించిన మహిళను రాజస్థాన్‌కు చెందిన రేష్మగా గుర్తించారు. చిన్నారి వినాయక చవితి రోజున, దర్శనం వేల జన్మించడంతో.. అదృష్టంగా భావిస్తున్నారు తల్లిదండ్రులు. శుభ సూచకంగా, గణనాథుడి ఆశీస్సులతో పుట్టిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.