D Mart Theft: డిమార్ట్ లో తక్కువ ధరలకు నాణ్యమైన వస్తువులు లభించడంతో చాలా మంది ఇక్కడ షాపింగ్ చేసేందుకు మొగ్గు చూపుతారు. రకరకాలా ఆఫర్లు, డిస్కౌంట్ల కారణంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులను ఇంటికి తీసుకెళ్తారు. నిత్యవసర సరుకుల నుంచి గృహోపకరణాల వరకు ఇక్కడ లభించడంతో సమయం, డబ్బులు ఆదా చేసుకోవచ్చనే ఆలోచనతో ఇక్కడ వస్తువుల కొనుగోలుకు మొగ్గు చూపుతారు.
దొంగతనానికి పాల్పడుతూ ఇద్దరు మహిళలు అరెస్ట్
డిమార్ట్ లో తరచుగా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే, దొంగతనాలు జరగకుండా స్టోర్లలో నిఘా పెంచారు. నిత్యం సీసీ కెమెరాల ద్వారా కస్టమర్లను మానిటరింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ, కొంత మంది దొంగతనం చేయాలని చూస్తూ పట్టుబడుతున్నారు. తాజాగా దొంగతనానికి ప్రయత్నించిన ఇద్దరు మహిళలను కూడా డిమార్ట్ స్టోర్ సిబ్బంది పట్టుకున్నారు. మందపాటి బట్టలు ధరించి వాటిలోపల దుస్తులు, ఇతర వస్తువులు పెట్టుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. వారిని పోలీసులకు అప్పగించారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందటే?
ముంబై ములుండ్ ప్రాంతంలోని డిమార్ట్ లో ఈ ఘటన జరిగింది. స్టోర్ మేనేజర్ సునీల్ గుప్తా ఇచ్చిన సమాచారం ప్రకారం.. సాయంత్రం సమయంలో లింక్ రోడ్డులోని డిమార్ట్ కు కోమల్ విశ్వకర్మ (30), సుమన్ విశ్వకర్మ (26) అనే ఇద్దరు మహిళలు షాపింగ్ కు వచ్చారు. ఒకటి రెండు వస్తువులు కొనుగోలు చేశారు. వారిద్దరూ బయటకు వెళ్తుండగా స్టోర్ సిబ్బందికి అనుమానం కలిగింది. వారి దుస్తులు అసాధరణంగా కనిపించాయి. వెంటనే సిబ్బంది స్టోర్ మేనేజర్ గుప్తాకు సమాచారం అందించారు. అంటనే అతడు వారిని చెక్ చేయాలని భావించారు. మహిళా సిబ్బందితో వారిని చెక్ చేయాలని చెప్పారు. కానీ, ఆ ఇద్దరు మహిళలు ఒప్పుకోలేదు. వెంటనే ఆయన, ములుంద్ పోలీసులకు సమాచారం అందిచారు.
లోదుస్తుల్లో పెట్టుకుని..
ఆ ఇద్దరు మహిళలను పోలీసులు, మరో ఇద్దరు మహిళల సమక్షంలో వారిని చెక్ చేశారు. వారు చీర లోపల ఏకంగా 18 రకాల దుస్తులు, 16 రకాల చెప్పులు, ఇతర వస్తువులను పెట్టుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. కొన్ని ఫుడ్ ఐటెమ్స్, బ్యూటీ సాధనాలు కూడా ఉన్నాయి. వాటన్నింటీని వారు కిందపడకుండా రెండు కాళ్ల మధ్యలో పెట్టుకుని వెళ్లాలని భావించారు. కానీ, సిబ్బంది అనుమానంతో దొంగతనం బయటపడింది.
Read Also: డి-మార్ట్ లో అత్యంత చౌకగా లభించే వస్తువులేంటీ? ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తారు?
నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
దొంగతనానికి ప్రయత్నించి పట్టుబడిన మహిళలపై ఇండియన్ జస్టిస్ కోడ్ 2023 లోని సెక్షన్ 3(5), 303(2) ప్రకారం కేసులు నమోదు చేశారు. వారిద్దరని రిమాండ్ కు పంపించారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు. ఇకపై స్టోర్లలో దొంగతనాలు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వస్తువులను కొనుగోలు చేయాలే తప్ దొంగతనానికి ప్రయత్నించకూడదన్నారు.
Read Also: డిమార్ట్ లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్ గా కొనేయొచ్చు?