Pawan Kalyan: వింటేజ్ పవన్ కళ్యాణ్ ను చూసి ఎన్నిరోజులు అవుతుందో.. ఆ ఎగిరే జుట్టు, కలర్ కలర్ డ్రెస్ లు, ముఖంలో నవ్వు, రొమాంటిక్ లుక్.. అబ్బా పవన్ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గరనుంచి ఇవన్నీ మిస్ అవుతున్నాం అని అభిమానులు చాలా అంటే చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు పవన్ ఏ ఈవెంట్ కు వచ్చినా ఏ డ్రెస్ లో వస్తాడో అని ఒక క్యూరియాసిటీ ఉండేది. కానీ ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా మారాడో అప్పటి నుంచి ఆయనను వైట్ అండ్ వైట్ లో తప్ప వేరే డ్రెస్ లో చూడడమే అరుదైపోయింది.
పోనీ సినిమాల్లో అయినా ఆ వింటేజ్ పవన్ ను చూద్దామంటే.. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గరనుంచి పవన్ లవ్ స్టోరీస్ లాంటివి కాకుండా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాడు. హరిహర వీరమల్లులో ఒకటే కాస్ట్యూమ్ లో కనిపించాడు. అలా ఎప్పటినుంచో పవన్ ను వింటేజ్ లుక్ లో చూడాలి అనుకున్న అభిమానుల కల.. కలగానే మిగిలిపోయింది. అయితే ఆ కలను నిజం చేశాడు కుర్ర డైరెక్టర్ సుజీత్. అతని దర్శకత్వంలో పవన్ నటిస్తున్న చిత్రం OG.
ఇక ఈ సినిమాపై అభిమానులు పెట్టుకున్న ఆశలు అంతా ఇంతా కాదు. అందుకు కారణం ఈ సినిమా ఏ సినిమాకు రీమేక్ కాదు కాబట్టి. గ్యాంగ్ స్టర్ కథతో పవన్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో సుజీత్ కూడా అలాగే చూపించబోతున్నాడు కాబట్టి. ఎందుకంటే సుజీత్ కూడా పవన్ కు వీరాభిమాని కాబట్టి. అందుకే OG పై ఫ్యాన్స్ అన్ని ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలను సుజీత్ సినిమా మొదలైనప్పటినుంచి ఇంకా పెంచుతూనే వస్తున్నాడు.
మొదటిరోజు సెట్ లో నుంచి రిలీజ్ అయిన ఫోటోస్ లోనే పవన్ వింటేజ్ లుక్ ను చూపించి హైప్ క్రియేట్ చేశాడు. అలా ఇప్పటివరకు OG ని ఎక్కడా తగ్గకుండా అంచనాలను ఇంకా పెంచుతూనే వస్తున్నాడు. ముఖ్యంగా ఈరోజు రిలీజ్ అయిన సాంగ్ లో పవన్ లుక్ చూసాక.. సుజీత్ కు గుడి కట్టినా తప్పులేదని దండం పెట్టేస్తున్నారు అభిమానులు. అసలు ఎప్పటి నుంచి పవన్ ను అలాంటి లుక్ లో చూడాలని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారో అచ్చంగా అలాగే దించేశాడు. సువ్వి సువ్వి సువ్వాలా సాంగ్ లో పవన్ లుక్ మాత్ర నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.
ఒకప్పటి పవన్ ఎలాగైతే ఉండేవాడో.. ఇందులో అచ్చు అలానే చూపించాడు. ఆ వింటేజ్ డ్రెస్ లు, వింటేజ్ హెయిర్ కట్.. ముఖ్యంగా పవన్ నవ్వు.. రొమాన్స్ .. సాంగ్ చూస్తున్నంత సేపు మన పవనేనా అని ఒక్క క్షణం మైమరిచిపోయేలా చేశాడు. ప్రియాంకతో పవన్ రొమాన్స్ అయితే బోనస్ అని చెప్పొచ్చు. పవన్ ను స్టైలిష్ గా చూపించిన డైరెక్టర్స్ ఉన్నారు కానీ, ఇంత క్లాస్ గా, ఇంకా చెప్పాలంటే క్యూట్ గా చూపించిన డైరెక్టర్ అయితే సుజీత్ అనే చెప్పాలి. ప్రస్తుతం పవన్ లుక్స్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సాంగ్ లోనే ఈ వింటేజ్ లుక్కా.. లేక సినిమా మొత్తం ఇలానే కనిపిస్తాడా.. ? అనేది తెలియాలంటే సెప్టెంబర్ 25 న థియేటర్ కి వెళ్లాల్సిందే.