BigTV English

AP Politics: గుంటూరు టీడీపీ కొత్త సారథి ఎవరంటే?

AP Politics: గుంటూరు టీడీపీ కొత్త సారథి ఎవరంటే?

AP Politics: గుంటూరు జిల్లా టీడీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ఈసారి జిల్లా టిడిపి సారథ్య బాధ్యతలపై కీలకం నిర్ణయం జరగబోతున్నారంటున్నారు. దానిపై గుంటూరు టిడిపి వర్గాలలో అధిష్టానం కూడా చర్చిస్తోదంట. ఆ మార్పు జిల్లా పైనే కాదు రాష్ట్రంలోనూ కీలకంగా ఉండే విధంగా టిడిపి అధిష్టానం ఆలోచన చేస్తుందట. అసలు ఏంటా మార్పు? జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ ఎందుకు ఆ నిర్ణయం దిశగా ఆలోచిస్తోంది?


ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని సీట్లు కైవసం చేసుకున్న టీడీపీ

ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మొత్తం ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో ఘన విజయం సాధించింది. రానున్న రోజుల్లోనూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో టిడిపి పటిష్టమైన పార్టీగానే ముందుకు వెళ్లే విధంగా అధిష్టానం కీలకమైన ఆలోచనలు చేస్తుందట. జిల్లాలో మరింత దూకుడుగా టిడిపి ముందుకు వెళ్లేలా అడుగులు వెయ్యటానికి సిద్ధమవుతోందంట. అందులో భాగంగా అధిష్టానం కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో అత్యంత కీలకమైన చర్చ నడుస్తుంది.


రాజధాని ప్రాంతంలో కీలకంగా ఉన్న తాడికొండ ఎమ్మెల్యే

ప్రస్తుతం టిడిపి గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్న తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌కి ఇటు రాజధాని ప్రాంతంలో కీలకంగా ఉంటున్నారు. శ్రావణ్‌కి పార్టీ బాధ్యతలు కూడా ఉండటంతో కొంత ఇబ్బందిగా ఉందనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతుంది. రానున్న రోజుల్లో అమరావతికి సంబంధించినటువంటి అంశాలు మరింత కీలకంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయనకి కొంత విశ్రాంతినిస్తూ పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలను వేరే వారికి అప్పగించి, పార్టీని జిల్లాలో మరింత పటిష్టం చేయాలనే ఆలోచన అధిష్టానానికి ఉన్నట్లు గత కొద్ది రోజులు జోరుగా ప్రచారం జరుగుతోంది.

కొత్తవారికి సారథ్య బాధ్యతలు అప్పగించడానికి సర్వేలు

తెనాలి శ్రావణ్ నుంచి పార్టీ పగ్గాలను వేరొక కీలక నేతకి ఇచ్చి పార్టీని గుంటూరు జిల్లాలో ఎదురులేకుండా చేయాలని అధిష్టానం చూస్తుందట.. అయితే మరి పార్టీకి సంబంధించిన బాధ్యతలు వేరే వారికి ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి అనే చర్చ మొదలైందంట. ఒకరిద్దరి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నప్పటికీ వారికి పార్టీ బాధ్యతలిస్తే జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయని దానిపైన కూడా అంతర్గతంగా అధిష్టానం సర్వేలు చేస్తున్నట్లు జిల్లా కీలక నేతలు అంటున్నారు. ఈసారి గుంటూరు జిల్లాకు సంబంధించి పార్టీ బాధ్యతల విషయంలో సామాజిక వర్గాల వారీగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సముచిత స్థానాలు పార్టీలో వచ్చే విధంగా ఉండేలా కసరత్తు మొదలైందంటున్నారు.

సీనియర్ నేతకు ఇస్తారా? యంగ్ లీడర్‌కు బాధ్యత కట్టబెడతారా?

ప్రస్తుతం గుంటూరు జిల్లా పార్టీకి సంబంధించి పగ్గాలు ఇవ్వాలంటే సీనియర్ నేతలకు ఇస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ సీనియర్ నేతలకు ఇవ్వాలంటే ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి? ప్రస్తుతం నూతనంగా పార్టీలో యాక్టివ్ గా ఉన్న నేతలకు ఇస్తే ఎలా ఉంటుంది? అన్న దిశగా టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోందంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉన్ననేపథంలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో రిజర్వేషన్ అంశాలతో మహిళలకు మరింతమందికి ఈసారి టికెట్ ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు. దాంతో ప్రస్తుతం మహిళలను పార్టీకి సంబంధించి మరింత కీలకంగా చెయ్యాలని ఆలోచన చేస్తుందంట టిడిపి అధిష్టానం.ఇందులో భాగంగా టిడిపి కంచుకోటగా భావించే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశాలలో మహిళలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ విధంగా మహిళా నేతలను ప్రోత్సహించడంతో రానున్న రోజుల్లో మహిళా రిజర్వేషన్లు వచ్చినా, పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న మహిళలకు అవకాశం ఇవ్వటం ఈజీగా మారే అవకాశం ఉంటుందని అంచనాలు వేస్తున్నట్లు తెలుస్తుంది.

పార్టీ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే ఆలోచన

అందులో భాగంగానే గుంటూరు జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలను మహిళా నేతకు ఇస్తే పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని అభిప్రాయపడుతున్నారంట. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ అంశం మరింత ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఉండటంతో పాటు రానున్న రోజుల్లో ఈ అంశం పార్టీకి మరింత అనుకూలంగా మారుతుందని టిడిపి అధిష్టానం లెక్కలు వేసుకుంటోందంట.. ప్రస్తుతానికి గుంటూరు జిల్లాలో మహిళా నేతకి పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు ఇవ్వాలంటే ముందుగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న గల్లా మాధవి పేరును కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేగా ప్రస్తుతం జిల్లాలో కీలకంగా ఉన్న మాధవికి పార్టీ పగ్గాలు కూడా ఇస్తే మరింత దూకుడుగా పార్టీ ముందుకు వెళ్లే అవకాశం ఉందన్న అభిప్రాయం కొందరి నేతలు నుంచి వినిపించినట్లు తెలుస్తుంది.. ప్రస్తుతానికి ఎమ్మెల్యే గా ఉన్న గల్లా మాధవి పార్టీలోకి వచ్చి ఎక్కువ కాలం కాకపోవటం, రాగానే ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి, ప్రస్తుతానికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే మిగిలినటువంటి వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని ఓ సీనియర్ నేత పార్టీ అధిష్టానానికి సూచించారంట.

మహిళా నేతకే ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు

మరి మహిళా నేతలకే ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలని ఆలోచన కూడా పార్టీ అధిష్టానం సీనియర్ నేతల నుంచి సమాచారాన్ని తెలుసుకుంటుందట.. అలా కాకుండా సామాజిక వర్గాల వారీగా ఆలోచించి ఇప్పటిలాగే పార్టీ కోసం పనిచేసే మరో నేతకి అవకాశం ఇవ్వాలంటే ఎవరికి ఇస్తే బాగుంటుందని సర్వేలు కూడా జరుగుతున్నాయంట.. బీసీ సామాజి వర్గానికి సంబంధించి వారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది? లేకపోతే గతంలోనూ జరిగినటువంటి చర్చల్లో భాగంగా కాపు సామాజి వర్గానికి వారికి ఏదైనా అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుందా? ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శ్రావణ్ కుమార్ వర్గానికి మళ్ళీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే విధంగా అధిష్టానం అభిప్రాయాలు సేకరిస్తోందంట.

Also Read: ఖైరతాబాద్ గణేశ్ క్యూలైన్‌లోనే మహిళ ప్రసవం..

ఏది ఏమైనా గుంటూరు జిల్లాలో పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో పాటు ప్రస్తుతం పార్టీలో యంగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారందరినీ కలుపుకొని వెళ్లే నేతకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే ఇటు పార్టీ, ఇటు ప్రభుత్వం రెండు ఒకే గాడిపై నడిచే అవకాశాలుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు రాకుండా, అందరూ సమన్వయంతో నడిచేలా చేయగల నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించాలని తెలుగు కోరుతున్నారు.

Story By Ajay Kumar, Bigtv

Related News

APSRTC employees: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ప్రమోషన్స్ పండుగ వచ్చేసింది!

Mega Projects in AP: ఏపీకి భారీ పెట్టుబడి.. అన్ని కోట్లు అనుకోవద్దు.. జాబ్స్ కూడా ఫుల్!

Vinayaka Chavithi 2025: దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన మట్టి గణేష్ విగ్రహం.. దర్శిస్తే కలిగే భాగ్యం ఇదే!

Heavy Rain Andhra: ఏపీకి భారీ వర్షసూచన.. రాబోయే 48 గంటలు కీలకం.. అప్రమత్తం అంటూ హెచ్చరిక!

Auto drivers: బస్సులో బిక్షాటన చేసిన ఆటో డ్రైవర్లు.. రోడ్డున పడ్డామంటూ ఆవేదన

Big Stories

×