BigTV English

Vijay Thalapathi: విజయ్ దళపతి అలాంటోడే.. నిజాలు బయటపెట్టిన నిర్మాత!

Vijay Thalapathi: విజయ్ దళపతి అలాంటోడే.. నిజాలు బయటపెట్టిన నిర్మాత!

Vijay Thalapathi: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఒకవైపు హీరోగా.. మరొకవైపు రాజకీయ నాయకుడిగా చలామణి అవుతూ.. కొత్త పార్టీతో వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు.. ఇదిలా ఉండగా తాజాగా విజయ్ దళపతి పై ఊహించని కామెంట్లు చేశారు ప్రముఖ నిర్మాత పిటి సెల్వ కుమార్ (PT Selvakumar). ముఖ్యంగా ఈయన నిర్మాత మాత్రమే కాదు విజయ్ మాజీ మేనేజర్ కూడా.. మరి విజయ్ పై ఎందుకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలేం జరిగింది? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.


విజయ్ పై నిర్మాత అసహనం..

అసలు విషయంలోకి వెళ్తే.. విజయ్ హీరోగా చింబు దేవన్ దర్శకత్వంలో ‘పులి’ అనే సినిమా 2017లో విడుదల అయింది. ఈ సినిమాను ఎస్ కే టి స్టూడియోస్ బ్యానర్ పై శిబూ తమీన్స్, పిటి సెల్వకుమార్ కలసి నిర్మించారు. అప్పట్లోనే విజయ్ మార్కెట్ తో పోల్చుకుంటే చాలా ఎక్కువ బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ఇందులో అతిలోకసుందరి శ్రీదేవి (Sridevi ) ప్రత్యేక పాత్రలో కనిపించింది. ప్రముఖ బ్యూటీ హన్సిక (Hansika ) హీరోయిన్ గా నటించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజే డిజాస్టర్ గా నిలిచింది. ఇక నిర్మాతతో పాటు బయ్యర్లు కూడా దారుణంగా నష్టపోయారు. ముఖ్యంగా ఇలాంటి చెత్త సినిమాలు ఎందుకు నటించావని అటు విజయ్ ను కూడా అభిమానులు చాలా దారుణంగా తిట్టిపోశారు కూడా. అలా పులి సినిమా ఒక పీడ కల అని, ఈ సినిమా గురించి అందరూ త్వరగా నే మర్చిపోయినా.. నిర్మాతను అప్పటి గాయాలు ఇంకా వెంటాడుతున్నాయని తాజాగా నిర్మాత వెల్లడించారు.


అలాంటి మనిషే అంటూ సంచలన వ్యాఖ్యలు..

దీనిపై పీటీ సెల్వకుమార్ మాట్లాడుతూ.. “భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ పులి చిత్రాన్ని ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాము. విడుదలకి ఒక్కరోజు ముందు కరెక్ట్ గా ఇన్కమ్ టాక్స్ అధికారులు రైడ్ చేశారు. దీంతో సినిమా ఆగిపోయిందని ప్రచారం చేయడంతో ఇక అంతా అయిపోయిందనుకున్నాను.. చాలా ఒత్తిడికి గురయ్యాను. నా 27 ఏళ్ల కష్టార్జితం మొత్తం ఈ సినిమా కోసం ధారపోశాను. నా స్థానంలో వేరొకరు ఉంటే ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకునేవారు. పులి సినిమాతో నాకు భారీ నష్టాలు వచ్చాయి. ఆ సమయంలో విజయ్ నన్ను పరామర్శించలేదు . కాల్ చేసి కనీసం ఓదార్పు కలిగించలేదు. నేను భారీగా నష్టపోయానని తెలిసి కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఇబ్బంది పెట్టాడు. సినిమా విడుదలైన తర్వాత ఐదు రోజుల వరకు విజయ్ తో మాట్లాడే అవకాశం రాలేదు. నిజానికి ఈ సినిమా పరాజయం పాలైనా నష్టం నాకే మిగిలింది. అటు విజయ్ కెరియర్ పై ఎటువంటి ప్రభావం చూపలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన రెమ్యూనరేషన్ కూడా డబుల్ అయ్యింది. పైగా ఈ సినిమా కోసం రూ.25 కోట్లు తీసుకుంటే.. తర్వాత చిత్రం కోసం రూ. 45 కోట్లు తీసుకున్నాడు. ముఖ్యంగా నష్టపోయి ఇబ్బందుల్లో ఉంటే విజయ్ అభిమానులు నన్ను ఒక ద్రోహిగా చూడడం నిజంగా బాధగా అనిపించింది” అంటూ తన బాధను వెల్లబుచ్చాడు పిటి సెల్వకుమార్. ఏదిఏమైనా ఒక నిర్మాత నష్టపోతే హీరోగా తన వంతు బాధ్యతగా సపోర్టుగా నిలవాల్సింది పోయి.. రెమ్యూనరేషన్ విషయంలో ఇబ్బంది పెట్టాడు అని తెలిసి ఇప్పుడు పలువురు నెటిజన్లు విజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Film industry: కిడ్నాప్ కేసులో హీరోయిన్.. మరో ముగ్గురు అరెస్ట్!

Comedian Sudhakar: నెలరోజులుగా కోమాలో స్టార్ కమెడియన్.. కొడుకు ఏమన్నాడంటే ?

Vijay Thalapathi: అభిమానిపై దాడి… హీరో విజయ్ పై కేసు నమోదు

Yellamma: ఎల్లమ్మ.. మళ్లీ హీరో మారడమ్మా.

Chiranjeevi: వినాయక చవితి స్పెషల్.. మన శంకర వరప్రసాద్ గెటప్ అదుర్స్!

Mowgli Glimpse: మోగ్లీ కోసం రంగంలోకి నాని.. ప్రేమ కథ అంటూ వీడియో రిలీజ్ చేసిన టీమ్!

Big Stories

×