Mowgli Glimpse:సినీ సెలబ్రిటీల వారసులు ఎప్పటికప్పుడు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తల్లిదండ్రుల బ్యాక్ గ్రౌండ్ ఒకటి రెండు చిత్రాలకు పనిచేసినా.. ఆ తర్వాత కష్టపడి ఇండస్ట్రీలో ఎదగాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో వారసుడు కూడా తన ఉనికిని చాటుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు రోషన్ కనకాల (Roshan Kanakala) . ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల (Raajiv Kanakala) , ప్రముఖ యాంకర్ సుమ కనకాల(Suma kanakala) కొడుకు రోషన్ కనకాల మొదటి చిత్రం బబుల్ గమ్ తోనే తన నటనతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈయన.. ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు
మోగ్లీ కోసం రంగంలోకి దిగిన నాని..
మోగ్లీ(Mowgli ) అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మాణంలో ‘కలర్ ఫోటో’ ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్ (Sandeep Raj) తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సాక్షి మడోల్కర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు ఈమె తొలిసారి తెలుగు తెరకు పరిచయం కాబోతోంది కూడా.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. మరి కొద్ది రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ముమ్మరం చేసిన చిత్ర బృందం సినిమాపై ప్రేక్షకులలో మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. అందులో భాగంగానే తాజాగా మోగ్లీ కోసం నేచురల్ స్టార్ నాని అంటూ ఆగస్టు 29న ఆయన నరేట్ చేసిన గ్లింప్ రాబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. మూవీ పై ఇప్పుడు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది అని చెప్పవచ్చు. మొత్తానికి అయితే ఒక చిన్న ప్రేమ కథ చెబుతాను అంటూ వీడియో రిలీజ్ చేసిన టీం ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
1850 రోజుల తర్వాత..
ఇదిలా ఉండగా మరొకవైపు డైరెక్టర్ సందీప్ రాజు కూడా ఆగస్టు 28న ఈ మూవీ నుంచి స్పెషల్ సర్ప్రైజ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.” 1850 రోజుల తర్వాత నా రెండో సినిమా మీ ముందుకు రాబోతోంది. మోగ్లీ పేరుతో పాటు స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి”. అంటూ సందీప్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చారు ఈ మేరకు రోషన్ కనకాల ఒక గుర్రాన్ని పట్టుకున్న పోస్టర్ ను షేర్ చేశారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తూ ఉండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు ఈ వినాయక చవితికి మోగ్లీ సందడి చేయబోతోంది.
also read:Vijay Thalapathi: విజయ్ దళపతి అలాంటోడే.. నిజాలు బయటపెట్టిన నిర్మాత!
ఒక చిన్న ప్రేమ కథ చెప్తా ❤️🔥🐎
'𝐓𝐇𝐄 𝐖𝐎𝐑𝐋𝐃 𝐎𝐅 𝐌𝐎𝐖𝐆𝐋𝐈' glimpse, narrated by the one and only Natural Star @NameisNani Garu ⭐
Out on 𝐀𝐔𝐆𝐔𝐒𝐓 𝟐𝟗𝐭𝐡, 𝐅𝐑𝐈𝐃𝐀𝐘 at 4.05 PM 🤩
A @SandeepRaaaj directorial.
🌟ing @RoshanKanakala & #SakshiMhadolkar
A… pic.twitter.com/JD5c7CpDFZ— People Media Factory (@peoplemediafcy) August 26, 2025