Ravichandran Ashwin: టీమిండియా స్టార్ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్… తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు గుడ్ బై చెబుతూ కీలక ప్రకటన చేశారు రవిచంద్రన్ అశ్విన్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశారు టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఈ ప్రకటన నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ అభిమానులు ఒక్కసారిగా… షాక్ అయ్యారు. గత సీజన్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో… రవిచంద్రన్ అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రిటైర్మెంట్ నేపథ్యంలో ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టాడు అశ్విన్.
ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విని ఈ సందర్భంగా ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్లేయర్ గా తన ప్రయాణం నేటితో ముగిసిందని ఈ సందర్భంగా రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించారు. అయితే వివిధ లీధులలో గేమ్ ఎక్స్ప్లోరర్ గా తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని కూడా వివరించారు. ఇంతకాలం వండర్ఫుల్ మెమోరీస్ మిగిల్చిన అన్ని ఫ్రాంచైజీలు అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఇటు భారత క్రికెట్ నియంత్రణ మండలికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు అశ్విన్. తన భవిష్యత్తును ఆస్వాదించేందుకు వేచి చూస్తున్నా.. అందుకే క్రికెట్కు అలాగే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు పోస్ట్ పెట్టారు.
ఇది ఇలా ఉండగా గత సంవత్సరం అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున రవిచంద్రన్ అశ్విన్ ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆ టోర్నమెంట్లో పెద్దగా అశ్విన్ కు అవకాశం ఇవ్వలేదు మహేంద్రసింగ్ ధోని. మహేంద్ర సింగ్ ధోనీకి అత్యంత సన్నిహితుడిగా అశ్విన్ కు పేరు ఉంది. ఇప్పటికీ మహేందర్ సింగ్ ధోని అంటే అశ్విన్ కు చాలా ఇష్టం. అయినప్పటికీ మొన్నటి సీజన్లో అశ్విన్ కు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు ధోని. ఐపిఎల్ 2026 టోర్నమెంట్ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని గ్రహించి ముందే రిటైర్మెంట్ ఇచ్చాడు రవిచంద్రన్ అశ్విన్. ఇదే విషయాన్ని.. క్రీడా విశ్లేషకులు కూడా స్పష్టం చేస్తున్నారు.
ఐపీఎల్ లో అశ్విన్ కెరీర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు అశ్విన్. ఈ నేపథ్యంలోనే 221 మ్యాచ్ లు ఆడిన అశ్విన్ మొత్తం 187 వికెట్లు పడగొట్టాడు. ఒకానొక సమయంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా కూడా వ్యవహరించారు అశ్విన్.
Also Read: Swastik Chikara’s father: నా కొడుకు క్రికెట్ ఆడకున్నా పర్వాలేదు… కోహ్లీకి నీళ్లు ఇచ్చి బతికేస్తాడు
Thank you for the Memories #Ashwin ❤️ #RavichandranAshwin pic.twitter.com/Py4wGgTouD
— Fukkard (@Fukkard) August 27, 2025