Discount Scheme: దేశంలో ప్రధాన నగరాల్లో రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఉద్యోగాల కోసం సిటీకి వచ్చేవారి సంఖ్య క్రమంగా రెట్టింపు అవుతోంది. వేగంగా ఆఫీసులకు వెళ్లాలనే ఆలోచనలో ట్రాఫిక్ రూల్స్ అధిగమిస్తారు. ఫలితంగా జరిమానాలు భారీగా పడుతున్నాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం వాహనదారులకు బంపరాఫర్ ఇచ్చింది. పెండింగ్ చలానాలు క్లియర్ చేసేవారికి 50 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. ఇదే సరైన సమయమని భావించిన వాహనదారులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కట్టేస్తున్నారు.
పెండింగ్‌లోవున్న ట్రాఫిక్ జరిమానాలపై బంపరాఫర్ ఇచ్చింది కర్ణాటక ప్రభుత్వం. ఒకేసారి కచ్చినవారికి 50 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. ఆగస్టు 23 నుండి సెప్టెంబర్ 12 వరకు మాత్రమే ఈ తగ్గింపు ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్‌ని వాహనదారులు చక్కగా వినియోగించుకుంటున్నారు.
పెండింగ్ బకాయిలు చెల్లించడం, చట్టపరమైన చర్యలను నివారించడంలో లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. గురువారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పోలీసులు నమోదు చేసిన పెండింగ్‌లో ఉన్న అన్ని ఈ-చలాన్‌లకు ఈ రాయితీ వర్తిస్తుంది. తొలి రెండు రోజుల్లో రూ. 7.19 కోట్ల చెల్లింపులు నమోదయ్యాయి.
ఏ స్థాయిలో అక్కడ ట్రాఫిక్ రూల్స్‌ని అధిగమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వివరాల మేరకు 2,56,102 కేసులు పరిష్కరించారు. రూ. 7 కోట్లకు పైగానే జరిమానాలు వసూలు చేసినట్టు తెలిపింది. అయితే ఈ ఆఫర్ ఫిబ్రవరి 11, 2023కి ముందు నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘన కేసులకు వర్తిస్తుందని పోలీసుల మాట.
ALSO READ: రంగంలోకి సుదర్శన చక్ర.. ఇక శత్రువుకి చుక్కలే
కర్ణాటక రాష్ట్ర పోలీస్-KSP యాప్ ని తీసుకొచ్చింది. బెంగళూరు ట్రాఫిక్ పోలీసు వెబ్‌సైట్ లేదా కర్ణాటక వన్ పోర్టల్‌లో తమ వాహన రిజిస్ట్రేషన్ నెంబరు నమోదు చేయడం ద్వారా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి 50 డిస్కౌంట్ వినియోగించుకుని మిగతా మొత్తానికి కట్టేస్తున్నారు.
ఆన్‌లైన్ చెల్లింపులతోపాటు సమీపంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లను సందర్శించి వాహన రిజిస్ట్రేషన్ వివరాలను అందించడం ద్వారా కూడా జరిమానాలను క్లియర్ చేయవచ్చు. జరిమానా తప్పుగా విధిస్తే వాహనదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.
బెంగళూరు సిటీలో ట్రాఫిక్ ఉల్లంఘనలు రెట్టింపు అవుతున్నాయి. 2024 అధికారిక డేటా ప్రకారం ఆ సిటీలో 8.29 మిలియన్లు ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. వాటిలో సిగ్నల్ జంపింగ్, తప్పుడు పార్కింగ్, అతివేగం, ప్రమాదకరమైన డ్రైవింగ్ వంటి కేసులున్నాయి. అత్యధిక కేసులు ద్విచక్ర వాహనాల నుండి ఎక్కువగా ఉన్నాయి. వాటిలో 5 లక్షలకు పైగానే ఉన్నాయి.