E-Paper
Advertisement

రంగంలోకి దిగేసిన కాక్రోచ్ జనతా పార్టీ.. జంతర్ మంతర్ వద్ద ధర్నా, హాజరు కావాలని యువతకు పిలుపు

రంగంలోకి దిగేసిన కాక్రోచ్ జనతా పార్టీ.. జంతర్ మంతర్ వద్ద ధర్నా, హాజరు కావాలని యువతకు పిలుపు
Advertisement

Delhi: ఎట్టకేలకు ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగేసింది కాక్రోచ్ జనతా పార్టీ. ఢిల్లీలో జూన్ 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు ఫౌండర్ అభిజిత్ దీప్కే. ఈ ధర్నాలో యువత పాల్గొవాలని ఆయన పిలుపు ఇచ్చారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలన్నది ఆయన ప్రధాన డిమాండ్.

ప్రత్యక్ష కార్యాచరణలోకి కాక్రోచ్ జనతా పార్టీ

Advertisement

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే ఇండియాలో అడుగుపెట్టనున్నారు. కేంద్రప్రభుత్వంపై ఆయన యుద్ధాన్ని ప్రకటించేశారు. నీట్, సీబీఎస్ఈ పరీక్ష విషయంలో నైతిక బాధ్య‌త వహించి కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌న్నది ప్రధాన డిమాండ్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశాడాయన.

ఈ కార్య‌క్ర‌మంలో మ‌ద్ద‌తుదారులు, విద్యార్థులు పాల్గొవాల‌ని కోరారు.  అంద‌రూ ద‌గ్గ‌ర‌కు రావాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని ప్రస్తావించాడు. రాజ్యాంగం అడుగు జాడ‌ల్లో మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ రాజీనామా చేయాలని  డిమాండ్ చేద్దామని, మ‌న గ‌ళం విప్పితే, దానికి వాళ్లు త‌ప్ప‌కుండా వింటార‌ని మనసులోని మాట బయటపెట్టారు.

Advertisement

జంతర్ మంతర్ వద్ద ధర్నా, యువత హాజరు కావాలని పిలుపు

జూన్ 6న మ‌ద్ద‌తుదారులంద‌రూ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల‌ని వీడియోలో పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి అందరూ కలిసి పార్ల‌మెంట్ స్ట్రీట్ పోలీసు స్టేష‌న్‌కు వెళ్దామ‌ని పేర్కొన్నాడు దీప్కే. జంత‌ర్ మంత‌ర్‌లో శాంతియుత ప్ర‌ద‌ర్శ‌న కోసం ప‌ర్మిష‌న్ కోరుదామని తెలిపారు.

నీట్, సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల విషయంలో విద్యార్థులు ఆందోళ‌న చెందుతున్నార‌ని, దీనికి ప్ర‌భుత్వం బాధ్య‌త తీసుకోవాల‌న్నారు. సోష‌ల్ మీడియా ద్వారా కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఏర్ప‌డింది. ఆ పార్టీని స‌బ్‌స్క్రైబ్ చేసిన సంఖ్య కోటికి పైగానే ఉంది.  యువత ధర్నాకు వస్తుందా? అన్నదే పెద్ద ప్రశ్న. ధర్నాకు పోలీసులు పర్మీషన్ ఇస్తారా? మరొక ప్రశ్న.

ALSO READ: బెంగాల్లో తీవ్ర కలకలం.. మమతా మేనల్లుడిపై దాడి.. బీజేపీపై తీవ్ర విమర్శలు

 

Related News

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

Big Stories

Advertisement
×