E-Paper
Advertisement

ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం.. జూన్ 2 నుంచేనా?

ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం.. జూన్ 2 నుంచేనా?
Advertisement

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగర ప్రయాణికులకు ప్రభుత్వం ఓ శుభవార్త ఇవ్వబోతోందనే చర్చ జోరుగా సాగుతోంది. ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఆలోచన కేవలం ప్రతిపాదన దశలో ఉన్నప్పటికీ, ఈ హైదరాబాద్ ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తోంది.

ఎంఎంటీఎస్ లో రోజూ వేలాది మంది  ప్రయాణం

హైదరాబాద్, సికింద్రాబాద్, లింగంపల్లి, ఫలక్‌నుమా, మేడ్చల్ వంటి ప్రాంతాల మధ్య ప్రతిరోజూ వేలాది మంది ఎంఎంటీఎస్ రైళ్లను ఉపయోగిస్తున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు, రోజువారీ ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉచిత ప్రయాణం అమల్లోకి వస్తే సాధారణ ప్రజలకు ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది.

ప్రజా రవాణాను వినయోగాన్ని పెంచాలనే ఆలోచనతో..

Advertisement

ప్రభుత్వం ప్రజా రవాణా వినియోగాన్ని మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించేందుకు కూడా ప్రజా రవాణాను ప్రోత్సహించడం అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఈ కారణంగానే ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణంపై ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఉచిత బస్సు ప్రయాణం మాదిరిగానే..

ప్రస్తుతం హైదరాబాద్‌లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది. అదే తరహాలో ఎంఎంటీఎస్ సేవలను కూడా ఉచితంగా అందిస్తే మరింత మంది ప్రజలు రైలు ప్రయాణాన్ని ఎంచుకునే అవకాశముంది. ముఖ్యంగా ఉద్యోగాలు, విద్యా సంస్థలకు వెళ్లే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

ఇప్పటి వరకు నో కన్ఫర్మేషన్!

Advertisement

ఉచిత ఎంఎంటీఎస్ రైలు ప్రయాణం గురించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సోషల్ మీడియాలో ఈ విషయంపై చర్చ జరుగుతున్నప్పటికీ, అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే వరకు దీనిని నిజమే అని నమ్మాల్సిన అవసరం లేదు. ప్రతిపాదన అమలులోకి వస్తుందా? లేదా? అన్నది ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ దీనికి ఆమోదం లభిస్తే హైదరాబాద్ నగరంలోని లక్షలాది మంది ప్రయాణికులకు పెద్ద ఊరటగా మారే అవకాశం ఉంది. రోజువారీ ప్రయాణ ఖర్చులు తగ్గడంతో పాటు ప్రజా రవాణా వినియోగం కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

అధికారిక ప్రకటన కోసం ప్రజల ఎదురు చూపులు

ప్రస్తుతం ప్రజలు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వెలువడిన తర్వాతే ఉచిత ప్రయాణంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇది కేవలం ప్రతిపాదనగానే భావించాల్సి ఉంటుంది.

Read Also: టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×