E-Paper
Advertisement

College Bus Fire Accident : తమిళనాడు కాలేజీ బస్సులో మంటలు.. బస్సులో 52 మంది విద్యార్థులు?

College Bus Fire Accident : తమిళనాడు కాలేజీ బస్సులో మంటలు.. బస్సులో 52 మంది విద్యార్థులు?
Advertisement

College Bus Accident : తమిళనాడులోని మెట్టుపాళయం సమీపంలో ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సు నిండా విద్యార్థులు ఉన్నారు. కానీ వెంటనే బయటకు దిగిపోవడంతో విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు.

నామక్కల్ జిల్లా రాశిపురం ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 52 మంది విద్యార్థులు సహా మరో ఐదుగురు సిబ్బంది 6వ తేదీన ఓ ప్రైవేట్ బస్సులో ఊటీకి విహారయాత్రకు వెళ్లారు. ఊటీలోని పర్యాటక ఆకర్షణలు సందర్శనానంతరం నిన్న రాత్రి ఊటీ నుంచి నామక్కల్ కు తిరుగుపయనమయ్యారు.

Advertisement

ఆ సమయంలో కాళ్లారు వంతెన సమీపంలోకి వస్తుండగా బస్సు కుడి వెనుక టైరులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని పట్టించుకోకుండా బస్సు డ్రైవర్ బస్సును నడుపుతూనే ఉన్నాడు. అర్ధరాత్రి కావడంతో విద్యార్థులు నిద్రపోతున్నారు. ఇంతలో గుర్తించిన డ్రైవర్ బస్సును అక్కడికక్కడే ఆపి ప్రయాణికులందరినీ దింపేశాడు.

ఈ క్రమంలో గాలి వేగంతో బస్సులో చెలరేగిన మంటలు నలుమూలలకు వ్యాపించాయి. స్థానికులతోపాటు మెట్టుపాళయం పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులోని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అప్పటికీ బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

Advertisement

ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో 2 గంటలకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.ఈ ఘటనపై మెట్టుపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×