E-Paper
Advertisement

తమిళ విక్టరీ విజయ్ కులం వివరాల కోసం.. నెట్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్స్, ఆ వివరాలు ఇవే!

తమిళ విక్టరీ విజయ్ కులం వివరాల కోసం.. నెట్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్స్, ఆ వివరాలు ఇవే!
Advertisement

Channai: దేశవ్యాప్తంగా టీవీకే పార్టీ చీఫ్ విజయ్ పేరు మార్మోగుతోంది. తమిళనాడులో ద్రవిడ దిగ్గజ పార్టీలను ఓడించిన ఆయనకే దక్కుతోంది. విజయ్ గెలుపు వెనుక బలమైన కారణమేంటి? సామాజికవర్గం అండదండలు ఆయనకు ఉన్నాయా? ఇంతకీ విజయ్ కులం ఏంటి? అనేదానిపై ఇప్పటికే గూగుల్‌లో వెతుకుతున్నారు నెటిజన్స్. విజయ్‌కు సంబంధించి వివరాలపై ఓ లుక్కేద్దాం.

తమిళ విక్టరీ విజయ్ కులం వివరాల కోసం

Advertisement

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించారు దళపతి విజయ్. ఆయన  విజయం సాధించడం వెనుక కేవలం అభిమానుల సంఘాలతోపాటు సొంత కమ్యూనిటీ సహాయపడింది. ఎందుకంటే తమిళనాడులో విజయ్ కమ్యూనిటీ వర్గం దాదాపు 33 శాతం ఉంది. ఒకవిధంగా చెప్పాలంటే విజయ్ విక్టరీ వెనుక ఆయన సామాజిక వర్గం బాగానే సహాయపడింది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత గూగుల్‌లో పదే పదే విజయ్ కులం గురించి సెర్చ్ చేశారు నెటిజన్స్. ఈ విషయంలో విద్యావంతులైన యువత ఒక నాయకుడి సిద్ధాంతాల కంటే పుట్టుకకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

Advertisement

విజయ్.. దళిత సామాజిక వర్గానికి చెందినవారని కొందరు, కాదు ఉన్నత వర్గానికి చెందినవారని మరికొందరు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ జెండా ఆవిష్కరణలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పెరియార్ వంటి మహనీయుల పేర్లను ప్రస్తావించడమే ఇందుకు ప్రధాన కారణం.

నెట్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్స్

విజయ్ తన సర్టిఫికెట్‌లో కులం కాలమ్ దగ్గర నో క్యాస్ట్ అని ఉంది. ఇది ఎన్నికల ముందు తీసుకున్న ఆయన వేసిన అడుగు కాదు. దశాబ్దాల కిందట ఆయన పేరెంట్స్ వేసిన మొదటి అడుగు. మానవత్వం ఉంటే చాలని నమ్మిన కుటుంబం నుంచి వచ్చారు విజయ్. విజయ్ తండ్రి చంద్రశేఖరన్ రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్ కాగా తల్లి తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు.

తమిళనాడులోని రామేశ్వర ప్రాంతానికి చెందిన సంపన్న వెల్లాలర్ కమ్యూనిటీ నుంచి వచ్చారు. విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్. గూగుల్‌లో క్రైస్తవుడని కనిపించడానికి ఇదే అసలు కారణం. విజయ్ దళితుడు కాదన్నది అసలు నిజం. విజయ్ జోసెఫ్ వెల్లాలార్ కమ్యూనిటీకి చెందినవాడు.

వెల్లాలార్ కమ్యూనిటీ అనేది తమిళనాడు, కేరళ, శ్రీలంకలోని ఉత్తర-తూర్పు ప్రాంతాలలో నివసించే పురాతన భూస్వామ్య, వ్యవసాయ కమ్యూనిటీ. వేలన్మై అంటే వ్యవసాయం చేసేవారుగా పిలుస్తారు. అత్యున్నత సామాజికవర్గాలలో ఒకటిగా దీన్ని చెబుతున్నారు. ఈ కమ్యూనిటీ వారు తమిళనాడు జనాభాలో దాదాపు 33 శాతం మంది ఉన్నారన్నది ఓ అంచనా. టీవీకే వచ్చిన ఓట్ల శాతం 34.9 శాతం.

ALSO READ: విజయ్‌కు బిగ్ రిలీఫ్.. కాంగ్రెస్ మద్దతు, ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని డిసైడ్

అందులో రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో వారంతా చురుకుగా పాల్గొంటున్నారు. పొదుపు చేయడంలో వీరికి తిరుగులేదు. వెల్లాలార్ కులం లోతుల్లోకి వెళ్తే.. వెల్లాలర్ అంటే వెల్ అంటే ఈటె, అలర్ అంటే సాగుదారుడు. ఆ రెండు తమిళ పదాల నుండి వచ్చినట్టు చెబుతారు. వీరు సాంప్రదాయంగా భూస్వాములు, సాగుదారులు అన్నమాట.

శతాబ్దాలుగా తమిళనాడులో ఆధిపత్యవర్గంగా కొనసాగుతోంది ఆ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ చారిత్రలోని వెళ్తే.. చోళులు, పాండ్యులు, పల్లవుల కాలంలో వెల్లాలర్ కమ్యూనిటీ ఉంది. వారంతా ఉన్నత స్థాయి యోధులు, అంతేకాదు పరిపాలనా అధికారులుగా ఉండేవారు. రాజ కోటల నిర్వాహకులుగా కూడా వ్యవహరించేవారు.

వెల్లాలార్ అనేది ఒక పెద్ద సమూహం. అందులో చాలా ఉపకులాలు ఉన్నాయి. వాటిలో కొంగు వెల్లలార్, తుళువ వెల్లలార్, చోళియ వెల్లలార్, కర్కతార్ వెల్లలార్, దేవేంద్ర వెల్లలార్ వంటివి ఉన్నాయి. ఈ కమ్యూనిటీకి చెందినవారి పేర్ల చివర పిళ్లై, మొదలియార్, గౌండర్ లాంటి బిరుదులను ఉపయోగిస్తారని తెలుస్తోంది.

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×