E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: తమ్ముడు మాటతో అవని కన్నీళ్లు..రాజేశ్వరి ఇంటికి ప్రణతి, భరత్.. పల్లవి ప్లాన్ సక్సెస్..

Intinti Ramayanam Today Episode: తమ్ముడు మాటతో అవని కన్నీళ్లు..రాజేశ్వరి ఇంటికి ప్రణతి, భరత్.. పల్లవి ప్లాన్ సక్సెస్..
Advertisement

Intinti Ramayanam Today Episode May 6th : ప్రణతిని అందరూ కలిసి భర్త పంపించేందుకు ఒప్పించి బయటికి తీసుకుని వస్తారు.. అయితే అవనిని ఏమండీ అని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎప్పుడూ అక్క అని పిలిచెను ఇప్పుడు ఏవండీ అని పిలుస్తున్నావ్ ఏంటి అని అడుగుతుంది. మీరు మీ పనులు చేసుకుంటే మేము మా పనులు చేసుకుంటాం దయచేసి మా పనుల్లో మీరు తల దూర్చకండి అని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చి భరత్ వెళ్తాడు. పల్లవికి మాత్రం వెళ్తాను సిస్టర్ అని మర్యాదగా చెప్పడంతో అవని షాక్ అవుతుంది.. నన్నేమో ఏవండి అని పిలుస్తున్నాడు పల్లవి నేమో అక్కా అని పిలుస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. మీనాక్షి చక్రధర్లు ఇద్దరు కూడా ప్రణతి వస్తుంది అని చాలా సంతోషంగా ఉంటారు..

కన్నీళ్లు పెట్టుకున్న అవని..

భరత్ తనని ఏవండీ అని పిలిచాడని వంటగదిలోకి వెళ్లిన అవని ఒంటరిగా ఏడుస్తూ ఉంటుంది.. అవని ఏమైంది ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అని అక్షయ్ అడుగుతాడు. ఉల్లిపాయలు కోస్తున్నానండి అందుకే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అని అవని ఎంత దాచాలని చూసినా కూడా.. అక్షయ్ మాత్రం నీ బాధ నీ అర్థం చేసుకోలేని అనుకుంటున్నావా అని అంటాడు. ఎప్పుడూ నాకు ఏ కష్టం వచ్చినా నీకు తోడు ఉంటాను అని భరత్ ఇప్పుడు పరాయిదాని లాగా ఏవండి అని పిలవడం నేను సహించలేకపోతున్నానండి అని అవని బాధపడుతుంది. వాడిని రాజేశ్వరి పిన్ని ఎంతగా మార్చేసిందో అర్థం కావడం లేదు అని అక్షయము పట్టుకొని అవని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వేం బాధపడకు అవని రాజేశ్వరి అత్తయ్య ఎలాంటిదో త్వరలోనే భరత్ కి కూడా తెలుస్తుంది అని అక్షయ్ అంటాడు.

ప్రణతికి దిమ్మతిరిగే షాక్…

Advertisement

ప్రణతిని ఇంటికి కాకుండా రాజేశ్వరి ఇంటికి తీసుకెళ్లడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది.. మనం మన ఇంటికి కాకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు అని ప్రణతి ఎంతగా అడుగుతున్నా సరే భరత్ మాత్రం చిన్న పని ఉందని అంటాడు. ప్రణతి నేను బయటే ఉంటాను నువ్వు వెళ్లి మాట్లాడేసి రాణి ఎంత చెప్తున్నా సరే భరత్ మాత్రం లోపలికి వెళ్లాల్సిందే అని అంటాడు. భరత్ అను నేను చూసిన రాజేశ్వరి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. నీ భార్యని తీసుకొని మీ ఇంటికి వెళ్లాల్సింది ఇక్కడికి వచ్చావ్ ఏంటి భరత్ అని అడుగుతుంది. నాకు ఆ ఇంట్లో పిలువలేదు ఆ చక్రధర్ ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు నా మాటకి నాకు విలువలేదు అందుకే అక్కడికి వెళ్లకుండా ప్రణతిని తీసుకొని ఇక్కడికి వచ్చాను అమ్మా అని అంటాడు.

కొడుకు వచ్చాడని సంతోషపడ్డ రాజేశ్వరి.. 

నా కొడుకు నా కోడలు నా ఇంటికి వచ్చేసారు నాకు చాలా సంతోషంగా ఉంది అని రాజేశ్వరి సంతోషంగా ఉంటుంది. భానుమతి నా మనవరాలు ఉండాల్సింది అత్తగారింట్లో ఇక్కడ కాదు అయినా బాలింత ఉండాల్సిన మనవరాలుని ఇక్కడ ఎందుకు ఉంచుతాను అంటున్నావ్ నువ్వు సర్ది చెప్పాల్సింది పోయి ఇలా చేస్తున్నావ్ ఏంటి రాజేశ్వరి అని భానుమతి అంటుంది.. అవును భరత్ నువ్వు మీ ఇంటికి వెళ్ళాలి ఏమున్నా ఏం జరిగినా కూడా నీ భార్యతో నీ తల్లిదండ్రుల దగ్గరే ఉండాలి అని రాజేశ్వరి కావాలని భరత్ అంటుంది. కానీ భరత్ మాత్రం నాకు ఆ ఇంట్లో మనుషులు విలువ ఇవ్వడం లేదమ్మా అందుకే నేను అక్కడికి వెళ్లాలని అనుకోవడం లేదు. నువ్వు వద్దని చెప్పు ఎక్కడికైనా వెళ్తాను కానీ ఆ ఇంటికి మాత్రం వెళ్ళను అని అనగానే రాజేశ్వరి ఎక్కడికి వెళ్లదు ఇక్కడే ఉండని అని అంటుంది.

భానుమతికి అవమానం.. 

Advertisement

ఏంటి రాజేశ్వరి నువ్వేం చేస్తున్నావ్ నీకైనా అర్థమవుతుందా వాళ్ళని పంపించాలి కదా నువ్వు ఎందుకు ఇక్కడ ఉంచుతాను అంటున్నావు అని భానుమతి అంటుంది. భానుమతి దగ్గరికి వచ్చిన రాజేశ్వరి నువ్వు నోరు మూసుకుని ఉండమని చెప్పాను కదా లేదంటే వెళ్ళిపో అని అంటుంది. నాకు విలువ లేని చోట నేనెందుకు ఉండాలి నా కొడుకు దగ్గరికి నేను వెళ్ళిపోతాను అని భానుమతి తన బ్యాగు తీసుకుని తన కొడుకు దగ్గరికి వెళ్ళిపోతుంది. రాజేశ్వరి ఈ విషయం ఎలాగైనా సరే పల్లవికి చెప్పాలని పల్లవికి ఫోన్ చేసి ఆ భరత్ ప్రణతిని తీసుకొని మన ఇంటికి వచ్చాడు అని నిజం చెప్తుంది పల్లవి చాలా సంతోషపడుతుంది. తన అక్కని కూడా పరాయిదాని లాగా మాట్లాడుతున్నాడు అంటే మన దగ్గరికి వచ్చేసినట్లే అని పల్లవి రాజేశ్వరి ఇద్దరు కూడా తమ ప్లాన్ సక్సెస్ అయిందని సంతోషంగా ఉంటారు.

మీనాక్షికి నిజం తెలుస్తుందా..? 

ప్రణతి అత్తయ్య మా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎలాగైనా ఈ విషయాన్ని చెప్పాలి అని అనుకుంటుంది. ఫోన్ చేయగానే అమ్మ ప్రణతి నీకోసమే భరత్ వచ్చాడు నువ్వు కోపంలో ఏది అనకు వాడిని కూల్ చేసే ప్రయత్నం చేయను అని అంటుంది. ఇంటికి తిరిగి వస్తున్నారని దేవుడికి పూజ చేసి మొక్కుకున్నాను త్వరగా ఇంటికి రండి అమ్మ అని మీనాక్షి అనగానే ప్రణతి తనకు నిజం చెప్పకుండా దాచేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో భరత్ ప్రణతిలా జన్మ రహస్యాన్ని బయట పెట్టబోతుంది. అవని . ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు మాటిచ్చిన ధీరజ్.. అడ్డంగా బుక్కయిన వల్లి.. భాగ్యం గుట్టు రట్టు..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×