BigTV English

Congress Complaints on PM Modi: ప్రధాని మోదీపై చర్యలు తీసుకోవాలి.. ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్..!

Congress Complaints on PM Modi: ప్రధాని మోదీపై చర్యలు తీసుకోవాలి.. ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్..!
Mallikarjun Kharge
Mallikarjun Kharge

Congress Party Complaints on PM Modi to Elections Commission: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో ముస్లిం లీగ్ తరహాలో ఉందంటూ మోదీ విమర్శించారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. 140 కోట్ల మంది భారతీయుల ఆకాక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే నెరవేర్చగలదు అని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్టర్ వేదికగా తెలిపారు.


ఎన్నికల సంఘం వద్ద ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ప్రధాని మోదీపై ఫిర్యాదు చేసింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రకటించింది. అయితే ఇది ముస్లిం లీగ్ తరహాలో ఉందని మోదీ విమర్శలు గుప్పించారు. ఏప్రిల్ 6వ తేదీనా అజ్మీర్ లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో ఓ అబద్ధాల పుట్ట అని, భారత్ ను ముక్కలుగా చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు హస్తం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఘాటుగా స్పందించింది. మోదీ తమపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని అందుకే తాము.. ఈసీని ఆశ్రయించినట్లు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్టర్ వేదికగా తెలిపారు.


“బీజేపీ రాజకీయ, సైద్ధాంతిక పూర్వీకులు స్వాతంత్ర్య ఉద్యమంలో భారతీయులకు వ్యతిరేకంగా బ్రిటిష్ , ముస్లిం లీగ్‌కు మద్దతు ఇచ్చారు. భారతీయుల సహకారంతో రూపొందించిన ‘కాంగ్రెస్ న్యాయ పాత్ర’కు వ్యతిరేకంగా నేటికీ ఆయన ముస్లిం లీగ్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. బీజేపీ నేతలు 1942లో “క్విట్ ఇండియా” సమయంలో మహాత్మా గాంధీ పిలుపును, మౌలానా ఆజాద్ నేతృత్వంలోని ఉద్యమాన్ని వ్యతిరేకించారు. మీ పూర్వీకులు 1940లలో ముస్లిం లీగ్‌తో కలిసి బెంగాల్, సింధ్ , NWFP లలో తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారని అందరికీ తెలుసు.

Also Read: Kerala CM Vijayan: బీజేపీ పాలనలో మీడియా స్వేచ్ఛ కనుమరుగైంది: కేరళ సీఎం విజయన్

1942లో దేశాన్ని, కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఎలా అణచివేయాలో అప్పటి బ్రిటిష్ గవర్నర్‌కి శ్యామా ప్రసాద్ ముఖర్జీ లేఖ రాయలేదా? మరి దీని కోసం వారు బ్రిటిష్ వారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా?. మోదీ, బీజేపీ నేతలు నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి తప్పుడు అపోహలను వ్యాప్తి చేస్తున్నారు. మోదీ ప్రసంగాలలో ఆర్‌ఎస్‌ఎస్ వాసన మాత్రమే ఉంది, బీజేపీ ఎన్నికల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోంది, ఆర్‌ఎస్‌ఎస్ తన పాత స్నేహితుడైన ముస్లిం లీగ్‌ని గుర్తు చేసుకోవడం ప్రారంభించింది” అని ట్వీట్ చేశారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×