BigTV English

Congress Reaction: హర్యానా ఎన్నికల ఫలితాలపై జైరాం రమేష్ హాట్ కామెంట్స్… వామ్మో ఇలా అనేశాడేంటి..?

Congress Reaction: హర్యానా ఎన్నికల ఫలితాలపై జైరాం రమేష్ హాట్ కామెంట్స్… వామ్మో ఇలా అనేశాడేంటి..?

Congress Reaction on Haryna Elections Results: జమ్మూకాశ్మీర్, హర్యానాలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. జమ్మూకాశ్మీర్ లో కాంగ్రెస్-ఎన్సీ కూటమికి ప్రజలు పట్టం కట్టారు. 50కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీకి ఇప్పటివరకు 28 సీట్లు వచ్చాయి. పీడీపీ పార్టీ మాత్రం దారుణంగా ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఎప్పుడూ లేనంతా కేవలం 2 సీట్లకు పరిమితమయ్యింది. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూతురికి కూడా ఈ ఎన్నికల్లో పరాభవం ఎదురైంది. ఇటు హర్యానాలో బీజేపీ లీడ్ లో కొనసాగుతుంది. ప్రస్తుతం 50 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్-ఎన్సీ కూటమికి 30కి పైగా సీట్లు వచ్చాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీరియస్ కామెంట్స్ చేసింది.


Also Read: హర్యానాలో బీజేపీ హవా.. అంతా ఆమ్ ఆద్మి దయేనా? అంచనాలన్నీ తారుమారు!

కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ ఏసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు ఆయన లేఖ కూడా రాశారు. ఎన్నికలకు సంబంధించిన సంబంధింతి ఈసీ వెబ్ సైట్ లో డేటాను అప్ లోడ్ చేయడంలేదంటూ జైరాం రమేష్ మండిపడ్డారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య ఈసీ వెబ్ సైట్ లో ఫలితాల అప్ లోడ్ కనిపించలేదన్నారు. గతంలో లోక్ సభ ఎన్నికల మాదిరిగానే హర్యానా కౌంటింగ్ ఫలితాల సరళిని ఎప్పటికప్పుడు ఈసీ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయడంలో తీవ్ర జాప్యం కనిపించిందన్నారు. ఈసీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందా ఏంటి అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తమ ప్రశ్నలకు ఈసీ సమాధానం ఇవ్వాలన్నారు.


హర్యానాలో ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. కానీ, బీజేపీ మైండ్ గేమ్ అడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై బీజేపీ ఒత్తిడి పెడుతుందని ఆయన ఆరోపించారు.

Also Read: ఈసీ వెబ్ సైట్ లో ఫలితాల జాప్యం.. ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్.. గెలుపుపై పార్టీల భిన్న వాదన

కాంగ్రెస్ వ్యాఖ్యలపై ఈసీ స్పందన…

కాంగ్రెస్ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ మేరకు ఈసీ మాట్లాడుతూ.. హర్యానాలోని ఎన్నికల ఫలితాల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తున్నామని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 25 రౌండ్ల కౌంటింగ్ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అప్ డేట్ చేస్తున్నట్లు ఈసీ పేర్కొన్నది. ఈ క్రమంలో అలా ఎలా అనవసరంగా మాట్లాడుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు విషయాలు తెలియకుండా బాధ్యతారహితమైన, నిరాధారమైన వ్యాఖ్యలను తాము తీవ్రంగా తిరస్కరిస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×