E-Paper
Advertisement

Cyclone Biparjoy: బిపర్‌జోయ్‌తో భారీ విధ్వంసమే.. తీరంలో హైఅలర్ట్..

Cyclone Biparjoy: బిపర్‌జోయ్‌తో భారీ విధ్వంసమే.. తీరంలో హైఅలర్ట్..
Advertisement
biparjoy

Cyclone Biparjoy: బిపర్‌ జోయ్‌ తుఫాన్‌ దూసుకొస్తోంది. బుధవారం సాయంత్రానికి గుజరాత్‌లోని జఖౌ పోర్టులతోపాటు పాకిస్తాన్‌లోని కరాచీ మధ్య తీరం దాటనుంది. బిపర్‌జోయ్‌ భారీ విధ్వంసాన్ని సృష్టించే ప్రమాదముందని హెచ్చరించింది ఐఎండి. ఈ ప్రభావం గుజరాత్‌లోని కచ్, ద్వారక, జామ్‌నగర్‌ జిల్లాలపైనే ఎక్కువగా ఉంది. ఇప్పటికే గుజరాత్‌లో పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. ఈదులుగాలులకు చెట్లు విరిగిపడుతున్నాయ్‌. తీరా ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. బీచ్‌ల వైపు ఎవరినీ అనుమతించడం లేదు అధికారులు.

కచ్, ద్వారక, జామ్‌నగర్, పోరుబందర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ. సముద్రంలో ఆరు మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే అలలు సౌరాష్ట్ర, కచ్‌ తీరాల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతాయని అంటున్నారు.

Advertisement

బిపర్ జాయ్ తుఫాన్ గుజరాత్ తీరంవైపు దూసుకొస్తుండటంతో ఇప్పటికే అధికారులు అప్రమత్తం అయ్యారు. కోస్టల్ ఏరియాల్లోని 30వేల మందిని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెల్టర్స్​ కు తరలించారు. ఎన్​డీఆర్ఎఫ్, ఎస్​డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ముంపు ప్రాంతాల్లోని ప్రజల తరలింపు కొనసాగుతూనే ఉందని అధికారులు ప్రకటించారు. తీర ప్రాంతానికి 10 కిలో మీటర్ల పరిధిలో నివాసం ఉంటున్న అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మరోవైపు తుఫాన్‌ ప్రభావంతో 95 రైళ్లును రద్దు చేశారు. తుఫాన్‌తో ఈదురుగాలులు కారణంగా.. రైళ్లను రద్దు చేశామంటున్నారు రైల్వే అధికారులు. రైల్వేల భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. తభావ్‌నగర్, రాజ్‌కోట్, అహ్మదాబాద్, గాంధీధామ్‌లలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌లు తెరిచి, అదనపు హెల్ప్‌లైన్ నంబర్‌లు కూడా యాక్టివేట్ చేశామన్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×