BigTV English

UV Light Technology : పంటలను మెరుగుపరిచే యూవీ లైట్ టెక్నాలజీ..

UV Light Technology : పంటలను మెరుగుపరిచే యూవీ లైట్ టెక్నాలజీ..

UV Light Technology : వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ఉపయోగించడం వల్ల అటు రైతులకు, ఇటు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. చాలావరకు రైతు కష్టాలకు టెక్నాలజీతో సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు శాస్త్రవేత్తలు. కెమికల్స్ సాయం లేకుండా మెరుగైన పంటను పండించడం, పంటను పురుగుల నుండి కాపాడడం.. ఇలాంటివన్నీ టెక్నాలజీ సాయంతోనే జరిగిపోతున్నాయి. తాజాగా మొక్కజొన్న, సోయాబీన్ పంటలు మెరుగ్గా పండడానికి ఒక కొత్త ఆలోచనతో శాస్త్రవేత్తలు ముందుకొచ్చారు.


పంటలు పండడానికి నీరు ఎంత ముఖ్యమో.. వెలుగు కూడా అంతే ముఖ్యం. లైట్‌కు ఉన్న పంటలు తొందరగా, ఆరోగ్యంగా పండుతాయని తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ లైట్ సాయంతోనే మొక్కజొన్న, సోయాబీన్స్ పంటలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ టెక్నాలజీ సాయంతో పంట మొక్కలు ధృడంగా పెరుగుతాయని వారు చెప్తున్నారు. ఆ టెక్నాలజీ పేరు ‘బయోల్యూమిక్’. అల్ట్రావైలెట్ (యూవీ) లైట్ సాయంతో మొక్కజొన్న, సోయాబీన్స్ పంటలకు సీడ్ ట్రీట్మెంట్‌ను అందించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. 2024లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.

ఈ టెక్నాలజీ అనేది లైట్‌ను మొక్కల లోపలకు చేరి.. వాటి ఎదుగుదలను, క్వాలిటీని, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఫోటోసింథసిస్ కాకుండా పంటను పండించే విషయంలో ఫోటోమోర్ఫోజెనసిస్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామని బయటపెట్టారు. మొక్కలలోని జెన్యూను మెరుగుపరిచి, పంటను బాగా పండించడానికి ఈ బయోల్యూమిక్ టెక్నాలజీ ఉపయోగపడుతుందన్నారు. గత కొన్నేళ్లుగా ఈ టెక్నాలజీపై పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.


2021 నుండి బయోల్యూమిక్ టెక్నాలజీ అనేది మొక్కజొన్న, సోయాబీన్స్ పంటలపై ఎలా ప్రభావం చూపిస్తుంది అని తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు ఇన్ ఫీల్డ్ టెస్టింగ్ నిర్వహించారు. 3000కు పైగా ఫీల్డ్ ప్లాట్స్‌లో వారు పరీక్షలు నిర్వహించారు. ఈ టెక్నాలజీ వల్ల మొక్కజొన్న పంటలో 15 శాతం దిగుబడి, సోయాబీన్స్‌లో 12 శాతం దిగుబడి పెరుగుతుందని వారు గమనించారు. అందుకే ఈ టెక్నాలజీలో కావాల్సిన మార్పులు చేర్పులు చేసి వచ్చే ఏడాది వరకు మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని శాస్త్రవేత్తలు సన్నాహాలు మొదలుపెట్టారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×