BigTV English

Su-30 MKI Jets’ Engines: సుఖోయ్ ఇంజిన్‌ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం.. ఒప్పందంపై సంతకం

Su-30 MKI Jets’ Engines: సుఖోయ్ ఇంజిన్‌ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం.. ఒప్పందంపై సంతకం

Su-30 MKI Jets’ Engines: దేశ రక్షణ శక్తిని బలపరిచేందుకు నిరంతరం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా రక్షణ శాఖ రక్షణ రంగంలో స్వావలంబనను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) నుంచి సుఖోయ్ -30 విమానాలకు సంబంధించిన 240 ఏఎల్-31 ఎఫ్ పీ ఏరో ఇంజిన్ ల కొనుగోలుకు రూ. 26 వేల కోట్లతో తాజాగా ఒప్పందం కుదిరింది. రక్షణ మంత్రిత్వ శాఖ, హెచ్ఏఎల్ సీనియర్ అధికారులు సోమవారం ఒప్పందంపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ సెక్రటరీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ పాల్గొన్నారు.


Also Read: రెండు కార్లు ఎదురెదురుగా ఢీ.. ఆరుగురు దుర్మరణం.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

అయితే, ఈ ఏరో ఇంజిన్లను HAL యొక్క కోరాపుట్ డివిజన్ లో తయారు చేస్తున్నారు. సుఖోయ్ -30 విమానాల ఫ్లీట్ కార్యాచరణ సామర్థాన్ని నిర్వహించడానికి ఇవి వైమానికి దళ అవసరాలను తీర్చగలవని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ ఒప్పందం ప్రకారం.. HAL సంవత్సరానికి 30 ఏరో ఇంజిన్లను సరఫరా చేస్తున్నది. ఈ విధంగా మొత్తం 240 ఇంజిన్ల సరఫరా వచ్చే 8 ఏళ్లలో పూర్తవ్వనున్నది. తద్వారా దేశ రక్షణ బలానికి ఈ ఒప్పందం కొత్త పుంతలు తొక్కుతుందడనంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి.


Also Read: అమెరికాలో రాహుల్‌గాంధీ.. కీలక వ్యాఖ్యలు, రాజకీయాల్లో గౌరవం లేదంటూ..

ఇదిలా ఉంటే.. ఈ ఇంజిన్లు 54 శాతం కంటే ఎక్కువ స్వదేశీ కంటెంట్ ను కలిగి ఉంటాయి. వీటిని.. హెచ్ఏఎల్ లోని కోరాపుట్ డివిజన్ లో తయారు చేయనున్నారు. SU-30 మార్క్ 1 అనేది భారత వైమానికి దళానికి చెందిన అత్యంత శక్తివంతమైన, వ్యూహాత్మకమైనటువంటి విమానాలల్లో ఇది ఒకటి. HAL ద్వారా ఈ ఏరో-ఇంజిన్ల సరఫరా భారత వైమానిక దళం యొక్క నిర్వహణ అవసరాలను తీర్చనున్నది. దీంతో, వారు తమ నిరంతర కార్యకలాపాలను కొనసాగించగలుగుతారు. అదేవిధంగా దేశ రక్షణ సంసిద్ధతను పటిష్టం చేసే వీలు ఉండనున్నది.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×