ఇన్నాళ్ల పాటు బీజేపీపై నిప్పులు చెరిగిన ఆ గొంతులో మళ్లీ సింపతి రాగం వినిపిస్తోంది. ఇన్నాళ్ల పాటు కాళ్లకు చక్రాలు కట్టుకొని పరుగులు పెట్టిన ఆ మనిషి ఇప్పుడు మళ్లీ తన ఆరోగ్య సమస్యలను ఏకరువు పెడుతున్నారు. జైలు నుంచి మళ్లీ బయటికి ప్రాణాలతో వస్తానో రానో అంటున్నారు. తాను లేకపోయినా ప్రజలకు అన్ని అందుతాయంటూ ఆయన ప్రభుత్వ పథకాల పేర్లన్నంటిని ప్రజలకు గుర్తు చేస్తున్నారు.
ఆఫ్‌కోర్స్ మరికొన్ని గంటల్లో పోలింగ్ ఉందనుకోండి.. ఇన్‌డైరెక్ట్‌గా ప్రజలకు గుర్తు చేశారేమో.. ఇక ఆఖర్లో ఆయన చెప్పేదేంటి అంటే.. ప్రజల మద్ధతుంటే త్వరలోనే బయటికి వస్తానంటున్నారు కేజ్రీవాల్
ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది కేజ్రీవాల్ ఇష్యూలో.. కేజ్రీవాల్ తన బెయిల్‌ను ఎక్స్‌టెండ్ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానికి ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే.. కొన్ని మెడికల్ టెస్ట్‌లు చేయించుకోవాలి.. నా ఆరోగ్యం అస్సలు బాగా లేదన్నారు. బట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెంటనే కౌంటర్ వేసింది. అనారోగ్యంగా ఉంటే ప్రచారం ఎలా చేశారు? ఇన్ని రోజులు లేని అనారోగ్యం ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇలా ప్రశ్నలు వేసింది. దీంతో సీన్ రివర్సైంది.
కేజ్రీవాల్ లెటెస్ట్ వీడియోలో తన బరువును కూడా మెన్షన్ చేశారు. జైలులో ఉన్న సమయంలో 6 కేజీల బరువు తగ్గానన్నారు. బట్ దీనిపై కూడా పెద్ద రాద్దాంతమే జరుగుతోంది. జైలులో ఉన్న సమయంలో కూడా ఆయన బరువులో పెద్ద మార్పేమి లేదన్న ప్రచారం జరుగుతోంది. కేజ్రీవాల్ లాంటి వ్యక్తులు కూడా ఇలాంటి చిల్లర రాజకీయం చేయడమేంటన్న చర్చ సాగుతోంది.
Also Read: తుది విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. నేడే ఎగ్జిట్ పోల్స్
నెక్ట్స్ ఢిల్లీలో ఉన్న వాటర్ క్రైసిస్.. ఈ విషయం మీడియాలో హైలేట్ కాగానే కేజ్రీవాల్ వ్యవహరించిన తీరు అద్భుతమైన రాజకీయ చాణక్యమనే చెప్పాలి. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దు అంటూ ట్వీట్ చేశారు కేజ్రీవాల్.. బాగుంది.. ఆ వెంటనే ఆయన చేసిన పని హర్యాణా, యూపీలకు లెటర్స్ రాశారు. అవి బీజేపీ పాలిత రాష్ట్రాలు.. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హర్యానా, యూపీ, హిమాచల్ ప్రదేశ్ నుంచి నీటిని అందించాలంటూ పిటిషన్ వేశారు..ఆ రాష్ట్రాలు సాయం చేయడానికి ముందుకు రావడం లేదంటున్నారు. బీజేపీ కావాలనే ఇదంతా చేస్తుందని బాల్‌ను బీజేపీ కోర్టులో వేసేశారు. సో.. రాజకీయం చేయకూడదు అంటూనే.. కంప్లీట్‌గా పొలిటికల్ అంశంగా మార్చేశారు కేజ్రీవాల్.
ఇక నెక్ట్స్ టాపిక్ అయితే మరీ ఇంట్రెస్టింగ్. ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్నారు కదా.. ఈ పొత్తు ఇకముందు కొనసాగుతుందా? అని ప్రశ్నించారు ఓ జర్నలిస్ట్.. దానికి ఆయనిచ్చిన ఆన్సర్ ఏంటో మీరే వినండి. కాంగ్రెస్‌తో తమ పార్టీకి ఏమైనా పెళ్లి జరిగిందా? లేదు కదా.. బీజేపీని ఓడించడమే తమ టార్గెట్.. అందుకోసమే ఈ పొత్తు.. బస్.. అంతకుమించి ఇంకేమీ లేదు.. అంటున్నారు కేజ్రీవాల్.. సో.. కేజ్రీవాల్ కూడా ప్యూర్ పొలిటిషియన్ అనేది ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం. ఇకపై ఇతర రాజకీయ నేతలు వేరు.. నేను వేరు అని చెప్పుకునే చాన్స్‌ను కోల్పోయారు కేజ్రీవాల్.. అంతేకాదు ఈ పొత్తుల పంచాయితీని చూస్తే.. కేజ్రీ ఆలోచనంత తన పార్టీ గ్రోత్‌పైనే ఉన్నట్టు క్లియర్ కట్‌గా కనిపిస్తోంది. ఏదేమైనా కేజ్రీవాల్ ఓ క్రేజీ పర్సన్ అనే చెప్పాలి.