Music Shop Murthy Trailer: కలర్ ఫొటో సినిమా ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అయింది నటి చాందిని చౌదరి. ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. దీంతో సినిమా ఆఫర్లను లైన్‌లో పెట్టేసింది. ఇందులో భాగంగానే ఇటీవల విశ్వక్ సేన్ ‘గామి’ మూవీలో హీరోయిన్‌గా నటించి అదరగొట్టేసింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే గాక.. కలెక్షన్లలో కూడా దుమ్ము దులిపేసింది. అలాగే చాందిని యాక్టింగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇదే క్రమంలో చాందిని వరుస పెట్టి ఆఫర్లను అందుకుంటుంది. ఈ మేరకు ఇప్పుడు మరొక సినిమా చేస్తోంది. టాలీవుడ్ నటుడు అజయ్ ఘోష్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. శివ పాలడుగు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి గ్రాండ్ లెవెల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, టీజర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి తన కలను నెరవేర్చుకోవడానికి ఏజ్‌తో సంబంధం లేదు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ట్రైలర్ ప్రకారం.. ఓ వ్యక్తి మ్యూజిక్ షాప్‌ను నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. పండుగలు, పెళ్లిళ్లలో తన మ్యూజిక్‌ను అందించి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. కానీ వాటి ద్వారా వచ్చిన డబ్బులు మాత్రం తమ కుటుంబానికి ఏమాత్రం సరిపోదు.
Also Read: ‘కాంతార చాప్టర్ 1’ లో స్టార్ యాక్టర్.. ఇక బాక్సాఫీసు బద్దలే..!
దీంతో ఆయన భార్య మ్యూజిక్ షాప్ కాకుండా వేరే బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుందని అనుకుంటుంది. ఇందులో భాగంగానే మొబైల్ షాప్ పెట్టుకుందామంటుంది. కానీ అతను మాత్రం ఫస్ట్ నుంచి తనకు మ్యూజిక్ మాత్రమే తెలుసని.. ఇంకేది రాదని అంటాడు. అయితే అలాంటి సమయంలోనే హీరోయిన్ చాందిని చౌదరి కనిపించి ఆయనలో ఆసలు రేపుతుంది.
మ్యూజిక్‌లోనే కొత్త దనాన్ని ఆయనకు పరిచయం చేస్తుంది. ఈ తరుణంలో ఆయన డీజే నేర్చుకోవడానికి ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటాడు. దాన్నే ఈ ట్రైలర్‌లో చూపించి సినిమా ఆసక్తి రేకెత్తించారు. కామెడీ, ఎమోషన్స్‌తో ఈ ట్రైలర్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి పవన్ సంగీతం అందిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా జూన్ 14న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.