BigTV English

Nizambad Holi festival with fist fighting:హోలీ అంటే అక్కడ పిడిగుద్దులాట, ఎందుకు?

Nizambad Holi festival with fist fighting:హోలీ అంటే అక్కడ పిడిగుద్దులాట, ఎందుకు?
Telangana village celebrates Holi with fist fighting
Telangana village celebrates Holi with fist fighting

Nizambad Holi festival with fist fighting: హోలీ పండగంటే ఆ సరదాయే వేరు. రంగులు జల్లుకుని వసంత రుతువు ఆగమానంను గుర్తు చేసుకుంటారు. మరి కొన్నిప్రాంతాల్లో అయితే హోలీ వచ్చిందంటే సంబరాలు వచ్చినట్టే. సంప్రాదాయవాదులైతే పౌర్ణిమనాడు కామదహనం నిర్వహించి మరునాడు పండగ చేసుకున్నారు. హోలీ పండగకు పెద్ద ప్రాముఖ్యత ఉందని పురాణాలు చెబుతున్నాయి. కైలాసంలో జరిగే హోలీ పండగకు దేవతలంతా వచ్చేవారని చెబుతారు.


తెలంగాణలోని ఓ గ్రామానికి మాత్రం హోలీ పండుగ వింత ఆచారం. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామం. హోలీ రోజు అక్కడ ఆ సందడే వేరు. ఇసుక వేస్తే రాలనంత జనం మధ్య ముష్టి ఘాతాలకు దిగుతారు. ఒకరి ముఖాలపై మరొకరు ఫంచ్‌లు విసురుకుంటారు. గ్రామంలోని ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి మధ్యలో ఒక రోప్ అడ్డంగా పెట్టుకుంటారు. ఈ ఉత్సవం ఆనవాయితీగా వస్తుందని చెబుతారు. అంతేకాదు ఈ సాంప్రదాయం దాదాపు 200 ఏళ్ల నుంచి కొనసాగుతుందనేది గ్రామస్థుల మాట.

ఈ పిడి గుద్దులాటలో శత్రువులు ఎవరూ ఉండరు.. అంతా గ్రామస్థులే. దాదాపు 15 నిమిషాల పాటు పిడిగుద్దుల గేమ్ సాగుతుంది. ఇసుక వేస్తే రాలనంత జనం, మరోవైపు గట్టి పోలీసు బందోబస్తు మధ్య ముష్టిఘాతాల వార్ జరుగుతుంది. హోలీ రోజు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు పడకపోతే అరిష్టమని అంటున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ముష్టిఘాతాలను చూసేందుకు ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్రకు చెందిన ప్రజలు హున్సా గ్రామానికి వెళ్తారు.


హిస్టరీలోకి వెళ్తే.. నిజామాబాద్‌‌లోని హున్సా గ్రామానికి పక్కనే మహారాష్ట్రలోని సగ్రోలి గ్రామం ఉండేది. ఈ రెండు గ్రామాల మధ్య వారం సంత జరిగేది. ఏళ్ల కిందట హున్సా గ్రామం పిడిగుద్దులాట ఉత్సవ ప్రతిపాదన తెచ్చింది. దీంతో వారంతపు సంతను సగ్రోలికి కేటాయించారు. ఆనాటి నుంచి నేటివరకు హున్సాలో ప్రతి ఏడాది హోలీ రోజు పిడి గుద్దుల పోటీ నిర్వహిస్తారు. ఇందులో కేవలం ఆ గ్రామస్థులు మాత్రమే పాల్గొంటారు. దీని కోసం యువత నెలరోజులకు ముందు నుంచే కసరత్తు చేస్తుంది.

పండగ రోజు శివారు పంట పొలాల్లో కుస్తీ పోటీలను నిర్వహిస్తారు. తర్వాత హనుమాన్ మందిరం వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత పెద్ద రోప్‌ను తెచ్చి ప్రజలు అటు ఇటు లాగుతారు. ఈ క్రమంలో ఎదురుగా ఉన్న వ్యక్తులపై పిడిగుద్దులు కురిపించుకుంటారు. ఇందులో గాయపడినవారికి కాముని దహనం సందర్భంగా బూడిద, మట్టి పూస్తారు. విచిత్రం ఏంటంటే కుల, మతాలకు అతీతంగా ఆడడం విశేషం. శతాబ్దకాలంలో ఈ ఉత్సవం ఎప్పుడూ ఆగలేదని అంటున్నారు. పోలీసులు వద్దని చెప్పినా హున్సా గ్రామస్థులు మాత్రం దీన్ని కంటిన్యూ చేస్తున్నారు.

Tags

Related News

Rangareddy News: బిర్యానీలో బొద్దింకలు.. తాండూరులో ఆ హోటల్ బాగోతం

Formula-E Race Case: ఫార్ములా రేస్ కేసు.. గవర్నర్‌కు నివేదిక, అనుమతి తర్వాత కేటీఆర్‌ అరెస్ట్?

Telangana politics: క్లారిటీ ఇచ్చిన లోకేష్.. ఔను ఇద్దరం కలిశాం, కవిత టీడీపీలోకి వస్తే

Formula E race case: ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలన పరిణామం.. ప్రభుత్వానికి ఏసీబీకి నివేదిక

Weather update: మళ్లీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వాన, జాగ్రత్త!

Warangal Incident: ‘నా భార్యతో ప్రాణహాని ఉంది’.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన భర్త

Big Stories

×