BigTV English

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసు.. జులై 12 వరకు కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు..

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసు.. జులై 12 వరకు కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు..

Delhi court extends Arvind Kejriwal’s custody: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కస్టడీ జులై 12 వరకు పొడిగిస్తూ రూజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా గత శనివారం సీబీఐ కేసులో కేజ్రీవాల్ కస్టడీని జులై 12 వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. సీబీఐ కేజ్రీవాల్‌ను జూన్ 26న అరెస్ట్ చేసింది.


ఈ ఉదయం, కేజ్రీవాల్ తనపై సీబీఐ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 41ను పాటించకుండా కేజ్రీవాల్‌ను అక్రమ కస్టడీలోకి తీసుకున్నారని ఆరోపిస్తూ బెయిల్ పిటిషన్‌ను గురువారం లిస్ట్ చేయాలని అతని న్యాయవాది రజత్ భరద్వాజ్ కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్‌‌పై స్పందించిన కోర్టు శుక్రవారం జాబితా చేసింది.

ఏప్రిల్ 22న కోర్టు ఆదేశాల మేరకు AIIMS ఏర్పాటు చేసిన ప్రత్యేక బోర్డుతో వైద్య సంప్రదింపుల సందర్భంగా కేజ్రీవాల్ తన భార్య హాజరు కావాలని కోరుతూ కేజ్రీవాల్ చేసిన పిటిషన్‌పై కోర్టు తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. కాగా జూలై 6 శనివారం నాడు కోర్టు తన తీర్పును ప్రకటించింది.


Also Read: లిక్కర్ కుంభకోణం కేసులో న్యూట్విస్ట్.. సీబీఐ కస్టడీలో కేజ్రీవాల్‌..

మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మార్చి 21న ఈడీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. గత నెల 20న రూజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయగా ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.

Related News

Bihar Politics: బీహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర ర్యాలీ.. మోదీ తల్లిని దూషించిన వ్యక్తి అరెస్ట్

Trump Tariffs: భారత్ బిగ్ స్కెచ్! ట్రంప్‌కు దూలతీరిందా?

Heavy Rains: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పొంగిపోర్లుతున్న వాగులు, వంకలు..

Modi Government: వాటిపై పన్ను కట్టాల్సిన పని లేదు.. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Richest Village: ఆ ఊళ్లో ప్రతి రైతూ కోటీశ్వరుడే.. ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం ఎక్కడంటే!

Trump Tariffs Effect: అమెరికా 50% పన్ను ప్రభావం.. 40 దేశాల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తోన్న భారత్

Big Stories

×