BigTV English
Advertisement

MS Dhoni-Virat kohli: కొహ్లీ విషయంలో.. నాడు ధోనీ, నేడు రోహిత్

MS Dhoni-Virat kohli: కొహ్లీ విషయంలో.. నాడు ధోనీ, నేడు రోహిత్

Ex pakistan Cricketer Umar Akmal Recalls MS Dhoni Stunning Response about kohli: టీ 20 ప్రపంచకప్ పట్టుకుని టీమ్ ఇండియా సగర్వంగా ఇండియాకు వస్తోంది. ఈ క్రమంలో పలువురు మాజీలు తమ అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్లేయర్ ఉమర్ అక్మల్ ఒక షాకింగ్ న్యూస్ చెప్పి నెట్టింటిని షేక్ చేశాడు. అది కూడా స్టార్ బ్యాటర్ కొహ్లీ విషయం కావడంతో ఇది మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది.


ఉమర్ అక్మల్ ఒక టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ 2012-13 సీజన్ విషయాలను పంచుకున్నాడు. అప్పుడు పాకిస్తాన్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఆ సమయంలో ఒకరోజు నేను ధోనీ, షోయబ్ మాలిక్, సురేశ్ రైనా, యువరాజ్ కలిసి డిన్నర్ కి వెళ్లాం. అదే సమయంలో ధోనీ వద్దకు టీమిండియా మేనేజర్ వచ్చాడు. అయితే ధోనీ కెప్టెన్ కావడంతో తనేమన్నాడంటే, విరాట్ కొహ్లీ ఫామ్ లో లేడు, అతన్ని వన్డే సిరీస్ నుంచి తప్పిద్దామని అన్నాడు.

అందుకు ధోనీ, నేను కూడా ఇంటికి వెళ్లి ఆరు నెలలవుతోంది. కొహ్లీతో పాటు, నాక్కూడా టికెట్ బుక్ చేయండి అని అన్నాడు. అంతే ఆ మేనేజర్ ముఖం మాడిపోయింది. కొహ్లీ విషయంలో మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడని అన్నాడు. తర్వాత ఇదే మాటను ఎందుకలా అన్నావని ధోనీని అడిగాను. దానికి ధోనీ ఏమన్నాడంటే, విరాట్ మా జట్టులో అత్యుత్తమ ప్లేయర్, కేవలం మూడు, నాలుగు మ్యాచ్ లు విఫలమైనంత మాత్రాన, పక్కనెలా పెడతామని అన్నాడు.


ఆ జవాబు విని నాకెంతో ఆశ్చర్యం కలిగింది. ఒక ఆటగాడి కోసం కెప్టెన్ ఎంత దూరమైనా వెళతాడనడానికి అదే ఉదాహరణ, అది ధోనీ చేశాడని అన్నాడు. బీసీసీఐ కూడా  ధోనీ నిర్ణయాలను అలాగే సమర్థించిందని కూడా గుర్తుచేసుకున్నాడు. అందుకనే అప్పుడు టీమ్ ఇండియా రెండు వరల్డ్ కప్ లు సాధించిందని ఉమర్ అక్మల్ తెలిపాడు.

Also Read: 11ఏళ్లప్పుడే ప్రతిజ్ఞ చేశా: గంభీర్

మళ్లీ అలాంటి సంఘటన అదే కొహ్లీ విషయంలో 2024 వరల్డ్ కప్ లో జరగడం యాధ్రచ్చికమే అయినా, నాడు ధోనీ ఎలా స్పందించాడో, ఇక్కడ రోహిత్ కూడా అలాగే స్పందించడం విశేషం. 2024 టీ 20 ప్రపంచకప్ లో విరాట్ ఫామ్ గురించి ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే సెమీఫైనల్ గెలుపు అనంతరం రోహిత్ ను ప్రశ్నించాడు. అందుకు తను సమాధానమిస్తూ, విరాట్ కొహ్లీ ఒక క్లాస్ బ్యాటర్. అతని ఫామ్ పై మేం పెద్దగా ఆందోళన చెందడం లేదు, అదసలు పెద్ద విషయమే కాదు, అయినా కొహ్లీ ఫైనల్ కోసం తన శక్తినంతా దాచి ఉంచాడేమోనని నవ్వుతూ అన్నాడు.

ఇది చూసి నెటిజన్లు నాడు కొహ్లీ విషయంలో ధోనీ, నేడు రోహిత్ శర్మ ఇద్దరూ ఒకేలా స్పందించడం గొప్ప విషయమని, టీమ్ ఇండియాకు ధీటైన నాయకులంటే వారేనని కొనియాడుతున్నారు.

Tags

Related News

Team India Jersy: బుర‌ద ప‌ట్టిన టీమిండియా జెర్సీ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే..చ‌రిత్ర‌లో మిగిలిపోవ‌డం ప‌క్కా

IND vs WI: రెండో టెస్ట్ లోనూ విజ‌యం…విండీస్ ను వైట్ వాష్ చేసిన టీమిండియా.. WTCలో మ‌న ర్యాంక్ ఎంతంటే

IND vs WI: తగలరాని చోట తగిలిన బంతి..కుప్ప‌కూలిన కేఎల్ రాహుల్‌…10 అడుగులు ప‌రుగెత్తి

SLW vs NZW: నేడు శ్రీలంక‌తో న్యూజిలాండ్ మ్యాచ్‌..వ‌ర‌ల్డ్ క‌ప్‌ పాయింట్ల ప‌ట్టిక ఇదే

Virat Kohli: ఆసీస్ టూర్ కు ముందు కోహ్లీని ఊరిస్తున్న 3 రికార్డులు ఇవే…ఇక ప్రపంచంలోనే మొన‌గాడు కావ‌డం ప‌క్కా

SaW vs BanW: బంగ్లాపై ద‌క్షిణాఫ్రికా విజ‌యం…పాయింట్ల ప‌ట్టిక‌లో కింద‌కు ప‌డిపోయిన టీమిండియా

Rohit Sharma: సెంటిమెంట్ డ్రామాలు ఆడుతున్న రోహిత్‌..ధోనిలాగా 50 ఏళ్ల వ‌ర‌కు ఆడాల‌ని ప్లాన్ ?

Ban-Burqa: బుర‌ఖా ధ‌రించి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ప్లేయ‌ర్లు ?

Big Stories

×