BigTV English

MLAs Free iPhones: ఎమ్మెల్యేలకు ఉచితంగా ఐఫోన్లు.. రాజకీయ రచ్చ, ఎక్కడంటే

MLAs Free iPhones: ఎమ్మెల్యేలకు ఉచితంగా ఐఫోన్లు.. రాజకీయ రచ్చ, ఎక్కడంటే

MLAs Free iPhones: టెక్ యుగం రాజ్యమేలుతున్న ప్రస్తుత రోజుల్లో ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి చాలా రాష్ట్రాలు. ఈ విషయంలో ఏపీ, తెలంగాణ తర్వాత మిగతా రాష్ట్రాలు చేరిపోయాయి. ఈసారి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు పేపర్‌ లెస్‌ విధానంలో జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం మొదలైంది. అసలేం జరిగింది?


ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పేపర్ లెన్ విధానానికి శ్రీకారం చుట్టింది రేఖా‌గుప్తా సర్కార్. ఈ నేపథ్యంలో సభలోని 70 మంది సభ్యులు ఐఫోన్ 16 ప్రో ప్రభుత్వం అందజేసింది. కేంద్రం తీసికొచ్చిన ‘వన్ నేషన్-వన్ అప్లికేషన్’ విధానంలో భాగంగా టెక్-ఆధారిత నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ (NeVA)ను తీసుకొచ్చింది.

అసెంబ్లీ అధికార-విపక్షాల సభ్యులకు యాపిల్‌ కంపెనీకి సంబంధించి స్మార్ట్‌ ఫోన్‌లను అందజేసింది. ఐఫోన్లతో పాటు ఐప్యాడ్‌లు, టాబ్లెట్‌లు ఇచ్చారు. వర్షాకాల సమావేశాల మొదటి రోజు ఐఫోన్ల పంపిణీతో సభ్యులందరూ వాటిని అందుకున్నారు. ఐఫోన్లు, టాబ్లెట్‌లతో కార్యకలాపాలు జరిగాయి. ఈ విషయాన్ని సెక్రటేరియట్ అధికారి ఒకరు వెల్లడించారు.


గత నెలలో శాసనసభ్యులకు దీనిపై శిక్షణ ఇచ్చారు. అందులో మైక్రోఫోన్‌లు, ఓటింగ్ ప్యానెల్‌లతో కూడిన స్మార్ట్ డెలిగేట్ యూనిట్లు, RFID/NFC (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) యాక్సెస్ వంటివి చూపించారు. ఐప్యాడ్‌ల ద్వారా రియల్-టైమ్ డాక్యుమెంట్ యాక్సెస్ చేయడం, HD కెమెరాలతో కూడిన ఆటోమేటెడ్ AV సిస్టమ్, పవర్-బ్యాక్డ్ నెట్‌వర్కింగ్ వంటి ఎలా ఉపయోగించాలో వివరించారు.

ALSO READ: కాల్పులకు తెగబడ్డ పాక్, స్ట్రాంగ్ కౌంటరిచ్చిన సైన్యం

ఢిల్లీ ప్రభుత్వం ముఖ్యమంత్రి-మంత్రుల మొబైల్ ఫోన్ కొనుగోలు పరిమితిని వరుసగా రూ. 1.5 లక్షలు, రూ. 1.25 లక్షలకు సవరించింది. ఫోన్ రీయింబర్స్‌మెంట్ పరిమితి పుష్కర కాలం తర్వాత సవరించబడింది. చివరి సవరణ 2013లో జరిగింది. అప్పుడు పరిమితి దాదాపు రూ.50,000గా ఉండేది.

అధిక ధరల ఫోన్ కొనుగోళ్లపై అధికార బీజేపీ-ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.  సభ్యులకు ఆయా ఫోన్లను అందించడంతో రేఖాగుప్తా సర్కార్‌పై ఆప్ మండిపడింది. ప్రభుత్వ ధనాన్ని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మాటేంటని నిలదీసింది.

అన్నట్లు మరో విషయం ఏంటంటే.. 500 కిలోవాట్ల రూఫ్‌టాప్ ప్లాంట్‌ ప్రారంభించిన తర్వాత ఢిల్లీ శాసనసభ పూర్తిగా సౌరశక్తి విద్యుత్ నడిచింది. ఆ విధంగా సమావేశాలు నిర్వహించిన మొట్టమొదటి అసెంబ్లీగా ఢిల్లీ అవతరించింది.

Related News

Poonch sector firing: కాల్పులకు తెగబడ్డ పాక్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సైన్యం!

Dharali floods: 11 మంది జవాన్లు గల్లంతు.. మరో నలుగురు మృతి.. అక్కడ ఊరుఊరంతా..?

Cloud Burst: క్లౌడ్‌బరస్ట్ అంటే ఏమిటీ? ఊళ్లను వల్లకాడు చేసే ఈ విపత్తు.. సునామీ కంటే ప్రమాదకరమా?

Uttarakhand floods: ఉత్తరాఖండ్ వరదల ఎఫెక్ట్.. వందల సంఖ్యలో ప్రజల గల్లంతు?

Cloud Burst: ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌బరస్ట్.. రెప్పపాటులో కొట్టుకెళ్లిపోయిన ఊరు.. భారీ సంఖ్యలో మరణాలు?

Big Stories

×