IND vs ENG: తొలిసారి శుభ్ మన్ గిల్ నాయకత్వంలో ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన ఐదు టెస్టుల సిరీస్ ని భారత జట్టు 2-2 తో సమం చేసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో బ్యాటింగ్ లో గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ దుమ్మురేపారు. ఇక బౌలింగ్ లో మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు రాణించారు. అయితే ఈ సిరీస్ ని సమం చేయడంలో పెద్దగా వెలుగులోకి రాని ప్లేయర్లు కూడా ఉన్నారు.
Also Read: Karishma Kotak : స్టేడియంలోనే బట్టలు మార్చుకున్న యాంకర్.. వీడియో చూస్తే!
వీరు కూడా భారత జట్టు ప్రదర్శనలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేశారు. ముఖ్యంగా చివరి టెస్ట్ లో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు గుజరాత్ టైటాన్స్ ప్లేయర్స్. ఐదవ టెస్ట్ చివరిలో వాషింగ్టన్ సుందర్ మెరుపు వేగంతో పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇక అటు కెప్టెన్సీ తో, ఇటు బ్యాట్ తో గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రసిద్ద్ కృష్ణ మూడు మ్యాచ్ లలో అద్భుతమైన ప్రదర్శనతో మెరిశాడు.
14 వికెట్లు తీసి బుమ్రా తో సమానంగా నిలిచాడు. బుమ్రా లేని సమయంలో ప్రత్యర్థులను దెబ్బ కొట్టడంలో ముందున్నాడు. ముఖ్యంగా ఓవల్ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో రూట్ ని అవుట్ చేయడం.. మ్యాచ్ మలుపు తిప్పిన సందర్భంగా చూడవచ్చు. బూమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ప్రసిద్ద్ కృష్ణ అంచనాలకు మించి రాణించాడు. మహమ్మద్ సిరాజ్ కి మరో ఎండ్ లో అండగా నిలిచాడు. ఆకాష్ దీప్ గాయంతో ఇబ్బంది పడడంతో సిరాజ్ తో కలిసి పేస్ బాధ్యతలను పంచుకున్నాడు.
ఇక ఈ సిరీస్ లో నాలుగు టెస్టులు ఆడిన వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లు తీశాడు. అలాగే అతడి బ్యాటింగ్ కూడా ఈ సిరీస్ లో ప్రత్యేకంగా నిలిచింది. నాలుగవ టెస్ట్ లో ఇంగ్లాండ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. రెండవ ఇన్నింగ్స్ లో అద్భుతమైన శతకం సాధించి మ్యాచ్ ని డ్రా దిశగా తీసుకువెళ్లాడు. ఇక ఈ సిరీస్ లో 23 వికెట్లు సాధించి, సిరీస్ లీడింగ్ వికేట్ టేకర్ గా నిలిచాడు మహమ్మద్ సిరాజ్. కీలక దశలో వికెట్లు పడగొట్టి, ఒత్తిడిని తట్టుకుని నిలబడిన అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు సిరాజ్ బౌలింగ్ ని చూసి ఫిదా అయ్యారు. ఇలా ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో గిల్ తో పాటు సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఇలా గుజరాత్ టైటాన్స్ కి చెందిన ఇద్దరు బ్యాట్స్ మెన్స్, ఒక ఆల్రౌండర్, ఇద్దరు బౌలర్ల ప్రదర్శన పై ప్రస్తుతం ప్రశంశల వర్షం కురుస్తుంది.
?utm_source=ig_web_copy_link