Balakrishna:ఈ మధ్యకాలంలో హీరోలు ఎక్కువగా ద్విపాత్రాభినయం చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ద్విపాత్రాభినయం చేయడం కాదు ఆ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించగలగాలి. కానీ ఈ జాబితాలో ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్ అని నిరూపించుకుంటున్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఇప్పటికే ఎన్నో సినిమాలలో డ్యూయల్ రోల్ పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఇప్పుడు మళ్లీ అదే డ్యూయల్ రోల్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి రెండు కాలాలు.. రెండు కోణాలు అనే రేంజ్ లో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మళ్లీ గోపీచంద్ డైరెక్షన్లో బాలయ్య..
ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand malineni) దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ సినిమా చేసి మంచి విజయం అందుకున్నారు బాలయ్య. ఇందులో తన మాస్ యాక్షన్ పర్ఫామెన్స్ తో మరొకసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఏడుపదుల వయసులో కూడా హీరోలకి పోటీ ఇస్తూ యాక్షన్ పర్ఫామెన్స్ తో డూప్ లేకుండా అదరగొట్టడం బాలయ్యకే సాధ్యమని నిరూపించారు. ఇప్పుడు ఇదే డైరెక్టర్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా మరొకవైపు ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విభిన్నమైన కంటెంట్.. రెండు కాలాలు.. రెండు కోణాలు..
ఈ సినిమా పూర్తయిన తర్వాత గోపీచంద్ డైరెక్షన్లో సినిమా మొదలు పెట్టనున్నారు బాలయ్య. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా అభిమానులలో అంచనాలు పెంచేసింది. అసలు విషయంలోకి వెళ్తే.. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఇప్పుడు చరిత్రను, వర్తమానాన్ని ముడిపెడుతూ ఒక వినూత్నమైన ఎపిక్ స్టోరీలా దీనిని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ కథాంశానికి తగ్గట్టుగానే ఇందులో బాలయ్య రెండు కోణాల్లో సాగే పాత్రలో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ పాత్రలలో బాలయ్య ఏ విధంగా నటిస్తారో.. ఏ రేంజ్ లో మెప్పిస్తారో .. అసలు వర్క్ అవుట్ అవుతుందా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరికొంతమంది మాత్రం పాత్ర ఏదైనా సునాయాసంగా సక్సెస్ కొట్టడంలో బాలయ్య తర్వాతే ఎవరైనా అని కామెంట్ చేస్తున్నారు.
బాలయ్య సినిమాలు..
2021లో తెలుగు భాషా ఫాంటసీ యాక్షన్ డ్రామా చిత్రంగా వచ్చిన చిత్రం ‘అఖండ’. బోయపాటి శ్రీను సహా రచయితగా, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ద్వారకా క్రియేషన్స్ ఆధ్వర్యంలో మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal), జగపతిబాబు(Jagapathi babu) , శ్రీకాంత్ (Srikanth) తదితర భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది. రూ.70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా అఖండ 2 రాబోతోంది. అదే ఆ తారాగణంతో రాబోతున్న ఈ సినిమా ఇప్పుడు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అలాగే సంయుక్త మీనన్ (Samyuktha Menon) కూడా ఇందులో భాగమైంది. ఇప్పటికే టీజర్ తో అంచనాలు పెంచేసిన చిత్ర బృందం ఈ సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో కఠినమైన సన్నివేశాలలో కూడా బాలయ్య డూప్ లేకుండా నటిస్తున్నారని తెలిసి సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.
ALSO READ:HBD Prudhvi Raj: 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా?