Big Stories

Updates on Arvind Kejriwal Arrest: కేజ్రీవాల్‌ జైలు నుంచి ఆదేశాలు ఎలా ఇచ్చారు..? ఈడీ సీరియస్..!

Arvind Kejriwal
Arvind Kejriwal

ED Serious on Arvind Kejriwal Order: జైలు నుంచే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారన్న వ్యవహారంపై వివాదం రేగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇచ్చిన ఆదేశాలంటూ మంత్రి అతీశీ ఆదివారం మీడియా మీట్ నిర్వహించి ఓ పేపర్ ను చూపించారు.

- Advertisement -

ఈ విషయంపై ఈడీ స్పందించింది. కస్టడీలో ఉండగా కేజ్రీవాల్ కు ఎలాంటి పేపర్స్ తాము ఇవ్వలేదని ఈడీ అధికారులు వెల్లడించారు. అలాంటప్పుడు ఆయన ఆదేశాలు ఎలా ఇచ్చారని ఈడీ అంటోంది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ విషయంపై దర్యాప్తు చేపడుతోంది. ఢిల్లీ మంత్రి అతిశీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తారని తెలుస్తోంది.  జైల్లో కేజ్రీవాల్‌ సీసీ దృశ్యాలను పరిశీలిస్తారని అంటున్నారు.

- Advertisement -

మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్ ను నిరసిస్తూ ఆప్ భారీ ఆందోళనకు సిద్ధమవుతోంది. లక్షా 50 వేల మందితో సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్చి 31న ఈ కార్యక్రమం నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మార్చి 27, 28 తేదీల్లో ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో భవిష్యత్తు కార్యాచరణను ఆప్ నేతలు ప్రకటించనున్నారు.

Also Read: కేజ్రీవాల్ టార్గెట్ గా కవిత విచారణ.. నిజామాబాద్‌లో ఈడీ బృందాల దర్యాప్తు?

కేజ్రీవాల్ అరెస్ట్ పై శివసేన ఉద్ధవ్ వర్గం స్పందించింది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎంను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని విమర్శించారు. ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ఆప్ నిర్వహించే సభలో పాల్గొంటామని తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News