BigTV English

Kamindu Mendis Record: కమిందు మెండిస్.. చరిత్రలో తొలిబ్యాటర్‌గా శ్రీలంక క్రికెటర్..

Kamindu Mendis Record: కమిందు మెండిస్.. చరిత్రలో తొలిబ్యాటర్‌గా శ్రీలంక క్రికెటర్..
Kamindu Mendis
Kamindu Mendis

Kamindu Mendis Created World Record Against Bangladesh: శ్రీలంక జట్టు ఏం చేసినా సెన్సేషన్ గానే ఉంటుంది. 2023 వరల్డ్ కప్ ఘోర ఓటమితో ఐసీసీ వేటుకి బలై సంచలనం స్రష్టించింది. ఇప్పుడు బంగ్లాదేశ్ పర్యటనలో రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.


బంగ్లాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లో సెంచరీలు చేశాడు. అయితే చాలామంది క్రికెటర్లు చేశారు. ఇందులో గొప్పతనం ఏముంది? అని అంతా అనుకుంటారు.

అయితే తను ఏడో నెంబర్ బ్యాటర్ గా వెళ్లి మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు. అలాగే రెండో ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ చేశాడు. ఇలా 7 నెంబర్ లో వెళ్లి చేయడమే ఇప్పుడు ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతగా మారింది.. అంతే కాదు 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డ్ గా నిలిచింది. ఇంతవరకు ఎవరూ అలా సెంచరీలు చేయకపోవడం విశేషం.


ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. మెండిస్ తో పాటు మరో బ్యాటర్ ధనంజయ డిసిల్వా కూడా తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ కూడా మెండిస్ తో కలిసి మరో సెంచరీ చేశాడు.

Also Read: GT vs MI: గెలుపు ముంగిట ముంబై బోల్తా.. ఉత్కంఠ మ్యాచ్‌లో గుజరాత్ విజయం..

ఇంతకీ కమిందు మెండిస్ (102, 164) చేస్తే, ధనంజయ డిసిల్వా (102, 108) చేయడం విశేషం. ఇక శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 280 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అందుకు బదులుగా బంగ్లాదేశ్ 188 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. మొత్తానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో మొత్తం 418 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి బంగ్లాదేశ్ ఎదుట 511 పరుగుల టార్గెట్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 182 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో శ్రీలంక 328 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

కమిందు మెండిస్ ఏడో స్థానంలో దిగి సెంచరీ చేసి రికార్డ్ సాధిస్తే, ఒకే టెస్టులో ఇద్దరు బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలు చేసిన మూడో జోడీగా రికార్డ్ సాధించారు. మిస్బా ఉల్ హక్, అజార్ ఆలీ (పాకిస్తాన్), గ్రెగ్ ఛాపెల్, ఇయాన్ ఛాపెల్(ఆస్ట్రేలియా) ఇలా రెండు ఇన్నింగ్సులో సెంచరీలు చేసి వీరికన్నా ముందున్నారు.

Tags

Related News

Swastik Chikara’s father: నా కొడుకు క్రికెట్ ఆడకున్నా పర్వాలేదు… కోహ్లీకి నీళ్లు ఇచ్చి బతికేస్తాడు

Indian Cricketers: ఆ ఒక్క నిర్ణయం… టీమిండియా క్రికెటర్లకు రూ.250 కోట్ల నష్టం!

Shubman Gill: సారాతో డేటింగ్… టాలీవుడ్ హీరోయిన్ తో పెళ్లి…చిల్ అవుతున్న గిల్ ?

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Big Stories

×