Big Stories

Kavitha – Kejriwal ED Investigation: కేజ్రీవాల్ టార్గెట్ గా కవిత విచారణ.. నిజామాబాద్‌లో ఈడీ బృందాల దర్యాప్తు..?

- Advertisement -

MLC – Kavitha Kejriwal ED Investigation: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఈడీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే కవిత, కేజ్రీవాల్ లను అరెస్ట్ చేసిన ఈడీ.. వారిద్దరినీ కస్టడీకి తీసుకుంది. కవిత ఈడీ కస్టడీ శనివారం(మార్చి23)తో ముగియగా.. మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది ఈడీ. ఈడీ విన్నపం మేరకు మూడు రోజులు కస్టడీకి అనుమతించింది. ఇప్పుడు ఈడీ కవిత, కేజ్రీవాల్ లను కలిపి ప్రశ్నిస్తోంది. మద్యంపాలసీ రూపకల్పన, ముడుపులు విషయం కేజ్రీవాల్ మెడ చుట్టూ ఉచ్చు బిగించేలా ఈడీ వ్యూహం రచిస్తోంది. కస్టడీలో ఉన్న కవితపైఅందుకు సంబంధించిన ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.

- Advertisement -

8వ రోజు విచారణలో కవితను నేరుగా.. మద్యంపాలసీలో అందిన ముడుపుల విషయంపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రూ.100 కోట్ల ముడుపుల చెల్లింపుల విషయంలో కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాతో కుదుర్చున్న ఒప్పందంలో సౌత్ గ్రూప్ మెంబర్స్ తో కలిసి చేసిన ముడుపుల చెల్లింపులకు సంబంధించిన కీలక సమాచారాన్ని కవిత ముందు ఉంచి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్కామ్ లో అందుకున్న ముడుపులను ఆప్ ఎన్నికల కోసం ఉపయోగించిన తీరు, కవిత పాత్రపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

అలాగే కవిత అత్యంత సమీప బంధువైన మేక శరణ్ కు ఈ స్కామ్ తో సంబంధం, అతని వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలపై కవితను పలుమార్లు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. లిక్కర్ వ్యాపారస్తుడైన సమీర్ మహేంద్రను కూడా శరణ్ వ్యవహారంపై ప్రశ్నించనునట్లు సమాచారం. ఈ మేరకు సమీర్ కు విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఇకపోతే.. ఇప్పటికే కేసులో అప్రూవర్లుగా ఉన్న కవిత మాజీ సీఏ బుచ్చిబాబు, మాగుంట రాఘవ్, మాగుంట శ్రీనివాసులుతో కలిపి సమీర్ ను విచారిస్తారా ? అన్న విషయం తెలియాల్సి ఉంది.

Also Read: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్

మరోవైపు నిజామాబాద్ లో కవిత వ్యాపార వ్యవహారాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. లిక్కర్ స్కామ్ లో అక్రమంగా సంపాదించిన సొమ్మును అక్కడ వివిధ వ్యాపారాల్లో పెట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ మేరకు నిజామాబాద్ లో కవిత అనుచరులను విచారించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. నిజామాబాద్ లో ఈసీ విచారణ తర్వాత.. కవితకు ఉచ్చు బిగుస్తుందని తెలుస్తుంది.

రేపటితో కవిత ఈడీ కస్టడీ ముగియనుంది. ఈలోగానే ఈడీ అన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని ఆధారాలను ఆమె ముందుంచి ప్రశ్నించనున్నట్లు సమాచారం. కేజ్రీవాల్ ఈడీ కస్టడీ మార్చి 28న ముగియనుంది. వీరిద్దరినీ కలిపి ప్రశ్నించాలంటే.. ఈడీ మరోసారి కవిత కస్టడీని పొడిగించాలని కోర్టును కోరాల్సి ఉంది. మరి కస్టడీని పెంచాలని కోరుతుందో లేదో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News