BigTV English

CM Kejriwal’s phone: కేజ్రీవాల్ ఫోన్ చుట్టూ దర్యాప్తు.. అందులో పోల్ స్ట్రాటజీ ఉందా?

CM Kejriwal’s phone: కేజ్రీవాల్ ఫోన్ చుట్టూ దర్యాప్తు.. అందులో పోల్ స్ట్రాటజీ ఉందా?

arvind kejriwal news today


Arvind kejriwal news today(Telugu flash news): మద్యం కుంభకోణం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఒకవైపు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని వచ్చేనెల ఒకటి వరకు పొడించింది న్యాయస్థానం. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన నేతలు ఈడీ, కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా ఈడీపై తీవ్ర ఆరోపణలు చేశారు ఢిల్లీ మంత్రి ఆతిశీ. తమ పార్టీ లోక్‌సభ ఎన్నికల వ్యూహాలను తెలుసుకోవడానికి ఈడీ ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని కోరుతూ ఈడీ చేసిన వాదనలను ఆమె గుర్తు చేశారు. ఈడీ దర్యాప్తు జరుగుతున్న మద్యం విధానం రెండేళ్ల కిందట కొన్నిరోజులపాటు అమల్లో ఉందని తెలిపింది. ఆ సమయంలో సీఎం కేజ్రీవాల్ ఉపయోగించిన ఫోన్ ప్రస్తుతం లేదన్నారు. ఇప్పుడు ఆయన వినియోగిస్తున్న ఫోన్‌ను కొద్దిరోజుల కిందట కొనుగోలు చేశారని వెల్లడించింది. కానీ, కొత్త ఫోన్ పాస్‌వర్డులను ఈడీ ఎందుకు అడుగుతోందని మంత్రి ఆతిశీ ప్రశ్నించారు.


ఈడీ వ్యవహారశైలి చూస్తుంటే.. బీజేపీకి రాజకీయ ఆయుధంగా పని చేస్తోందని దుయ్యబట్టారామె. ముఖ్యంగా ఆప్ లోక్‌సభ ఎన్నికల వ్యూహాలు, ప్రచార ప్రణాళికలు, విపక్ష ఇండియా కూటమి నేతలతో జరిపిన చర్చలు, సోషల్ మీడియా ప్రచారానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈనెల 21న ఈడీ జరిపిన సోదాల్లో నాలుగు డిజిటల్ గాడ్జెట్స్‌ను సొంతం చేసుకుంది. వాటి పాస్‌వర్డ్ ఆయన ఇవ్వలేదని తెలిపింది ఈడీ.

Tags

Related News

Kerala Court Judgment: తల్లికి భరణం చెల్లించని వ్యక్తికి జైలు శిక్ష

Malaria vaccine: మలేరియాకు మందు.. భారత తొలి వ్యాక్సిన్‌కు హైదరాబాద్ నుంచే శ్రీకారం

Milk Prices: శుభవార్త.. తగ్గనున్న పాల ధరలు.. లీటర్‌కు ఎంత తగ్గిస్తారంటే

Indian Constitution: పొరుగు దేశాలు చూశారా ఎలా ఉన్నాయో.. నేపాల్, బంగ్లాదేశ్‌లపై.. భారత సుప్రీం కోర్డు కీలక వ్యాఖ్యలు

Samruddhi Mahamarg: సమృద్ధి మహామార్గ్ ఘటన.. అసలు కారణం ఇదే

Nepal Viral Video: మా హోటల్‌కు నిప్పు పెట్టారు.. బయటకు వెళ్లలేని పరిస్థితి.. నేపాల్‌లో భారత మహిళకు భయానక అనుభవం

Big Stories

×