Amboli Waterfall Snake Video Goes Viral: మహారాష్ట్రలోని అంబోలి జలపాతం దగ్గర సరదాగా గడుపుతున్న ఓ ఫ్యామిలీకి ఊహించని షాక్ తగిలింది. చిన్నపిల్లతో కలిసి జలపాతం అందాలను ఆస్వాదిస్తున్న సమయంలో, ఒక్కసారిగా పైనుంచి భయంకరమైన పాము కిందికి పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అంబోలి జలపాతం దగ్గర పర్యాటకులు సాధారణంగా నీటితో తడుస్తూ, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే ఓ కుటుంబం కూడా అక్కడ సరదాగా గడుపుతోంది. ఓ వ్యక్తి చిన్న బాబును ఎత్తుకుని ఉండగా, అతడి పక్కనే పైనుంచి పాము పడుతుంది. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే పాము అక్కడికి నుంచి వేగంగా నీటిలోకి వెళ్లడంతో చుట్టుపక్కల ఉన్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతో కొందరు కేకలు వేస్తూ అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు.
జలపాతం దగ్గర సాధారణంగా సందడి, పర్యాటకుల కేరింతలు కనిపిస్తుంటాయి. కానీ, పాము పడిన వెంటనే అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. చిన్నారిని ఎత్తుకున్న వ్యక్తి కూడా అప్రమత్తమయ్యాడు. సమీపంలో ఉన్నవారు కూడా పాముకు దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించారు.
వైరల్ అవుతున్న వీడియోలో పాము ఎత్తైన ప్రాంతం నుంచి కిందకు పడినట్లు కనిపిస్తోంది. అది పడిన తీరు చూస్తే, పైభాగంలోని చెట్లు, రాళ్ల మధ్య నుంచి నీళ్లలోకి కొట్టుకొని వచ్చి ఉండొచ్చనే అనుమానం కలుగుతోంది. ఇక వీడియోలో కనిపిస్తున్న పాము ఆకారం, రంగు, శరీర నిర్మాణాన్ని చూసి కొందరు అది నాగుపాములా ఉందని చెబుతున్నారు. పాము విషపూరితమైనదా? కాదా? అనే విషయం కంటే, పర్యాటకుల మధ్యలో అకస్మాత్తుగా పడటమే అక్కడున్న వారిని తీవ్ర భయానికి గురిచేసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా షేర్ అవుతోంది. పాము ఒక్కసారిగా పైనుంచి కిందకు పడటం, దాని తర్వాత అక్కడున్నవారు భయంతో స్పందించిన తీరు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వెళ్లే పర్యాటక ప్రాంతాల్లో ఇలాంటి అనూహ్య ఘటనలు జరగడంతో టూరిస్టులు భయాందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో జలపాతాలు, అడవులు, కొండ ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు పరిసరాలను గమనిస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
జలపాతంలో పైనుంచి పామూ పడింది.. వైరల్ వీడియో
మహారాష్ట్రలోని అంబోలి జలపాతం వద్ద కుటుంబంతో సరదాగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా పైనుంచి భారీ పాము పడింది
చిన్నారిని ఎత్తుకుని ఉన్న వ్యక్తి పక్కనే పాము పడటంతో అక్కడున్నవారు హడలిపోయి కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఇది కోబ్రా అనిపిస్తుంది pic.twitter.com/cUXm49jM7A
— basker reddy (@chicagobachi) September 15, 2026
Read Also: యమలోకం దాటి వెళ్తే.. కోటి గాజుల గణపతి దర్శనం.. గాజువాకలో అదిరిపోయే వినాయక మండపం!