BigTV English

KIM : కిమ్ భార్య ధరించిన నెక్లెస్ ఏంటో తెలుసా..? వెరీ వెరీ స్పెషల్..

KIM : కిమ్ భార్య ధరించిన నెక్లెస్ ఏంటో తెలుసా..? వెరీ వెరీ స్పెషల్..

KIM : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సంచలనాలకు మారుపేరు. అగ్రరాజ్యం అమెరికాను సైతం లెక్కచేయని తత్వం. పొరుగుదేశం దక్షిణ కొరియాకు కొరకరాని కొయ్య. ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏం చేసినా సంచలనమే. అమెరికా హెచ్చరికలను లెక్క చేయకుండా ఎన్నోసార్లు క్షిపణి ప్రయోగాలు చేశారు. తమ దేశ ఆయుధ సామర్థ్యాన్ని పెంచుకున్నారు. యుద్ధానికి వెనుకాడని నైజం కిమ్ ది.


కిమ్ కుటుంబం ఎప్పుడూ బయటకు పెద్దగా కనిపించదు. కిమ్ సోదరి మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంటారు. దేశ వ్యవహారాల్లో ఆమె కీ రోల్ పోషిస్తున్నారు. అయితే తాజాగా కిమ్ భార్య రి సోల్ జు సైనిక కవాతు హాజరయ్యారు. అయితే ఆమె ధరించిన నెక్లెస్ పై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ఆ ఫోటో వైరల్ అవుతోంది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఆకారంలో ఉన్న లాకెట్ తో కూడిన నెక్లెస్ ను కిమ్ భార్య ధరించడం ఆసక్తిని రేపుతోంది. ఉత్తర కొరియాలోని ప్యోంగ్యాంగ్‌లో కొరియన్ పీపుల్స్ ఆర్మీ 75వ వార్షికోత్సవ వేళ జరిగిన కార్యక్రమంలో కిమ్ ఫ్యామిలీ పాల్గొన్నారు. కిమ్ కుమార్తె కిమ్ జు ఏ కూడా ఈ వేదికపై కనిపించారు. ఈ మధ్యకాలం కిమ్ కుమార్తె ఇలా ప్రభుత్వ కార్యక్రమాలకు రావడం ఐదోసారి కావడం విశేషం. గతంలో కిమ్ ఫ్యామిలీ ఎప్పుడోగానీ బయటకు వచ్చేవారు కాదు.

అయితే కొన్నిరోజుల క్రితం ఉత్తర కొరియా అధ్యక్షుడు ​కిమ్‌ అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయనకు ఆరోగ్యం బాగోలేదని రూమర్లు వినిపించాయి కొద్ది రోజులుగా ఆర్మీ ముందుకు రాకపోవడం అనుమానాలకు తావు ఇచ్చింది. కిమ్ కనిపించకపోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కిమ్‌ గతంలోనూ 2014లో దాదాపు 40 రోజులపాటు కనిపించలేదు. అయితే అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ కిమ్ దర్శనమివ్వడం విశేషం. అదే సమయంలో ఆయన భార్య రి సోల్ జు క్షిపణి ఆకారంలో ఉన్న లాకెట్ ను ధరించడం ఆసక్తిని కలిగిస్తోంది.


మరోవైపు ఆర్మీ వార్షికోత్సవం వేళ కిమ్‌ తమ దేశ అణ్వాయుధ క్షిపణి సామర్థాన్ని ప్రదర్శిస్తారేమోనని అమెరికా దాని మిత్ర దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఇటీవల దక్షిణ కొరియా, యూఎస్‌ ఉమ్మడి సైనిక విన్యాసాలపై నార్త్ కొరియా తీవ్ర అభ్యంతరం తెలిపింది. యూఎస్‌ ఎత్తుగడలను తిప్పికొట్టేలా అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధాలను ప్రయోగిస్తామని హెచ్చరించింది. ఉత్తరకొరియా 2022లోనే 70 కంటే ఎక్కువ బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. ఇందులో దక్షిణ కొరియాలోని లక్ష్యాలను చేధించడానికి, అమెరికాలోని ప్రధాన భూభాగాన్ని చేరుకునే సామర్థ్యం ఉన్న అణ్వయుధాలు ఉన్నాయి.

ఇప్పుడే అలాంటి బాలిస్టిక్ క్షిపణి ఆకారంలో ఉన్న నెక్లెస్ కిమ్ భార్య వేసుకోవడం వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. కేవలం కిమ్ ఒక్కడే కాదు వారి కుటుంబ సభ్యుల ఆలోచనలు ఒకటేనని తాజా సంఘటన స్పష్టం చేస్తోంది. వారు యుద్ధానికి భయపడరు. ఆయుధ సంపత్తిని పెంచుకుంటారు. వాటి తయారీపైనే కిమ్ దృష్టి ఉంటుంది. అందుకే ఆయుధాల తయారీలోనే కాదు వేషధారణలోనూ వారు ఆయుధ నమూనాలనే వినియోగిస్తారని తాజా సంఘటన రుజువు చేసోంది. కిమ్ భార్యా నా మజాకా..!

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×