BigTV English

Doda Encounter: భారత ఆర్మీపై ఉగ్రవాదుల పంజా.. నలుగురు సైనికులు మృతి!

Doda Encounter: భారత ఆర్మీపై ఉగ్రవాదుల పంజా.. నలుగురు సైనికులు మృతి!

4 Army Soldiers Killed in Doda Encounter: భారత ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠినచర్యలు తీసుకుంటున్నా దాడులు మాత్రం ఆగడం లేదు. ఓ పక్కన అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదంపై అన్ని దేశాలు కలిసి కట్టుగా పోరాడాలని చర్చలు జరుపుతుంతండగా ఉగ్రవాద కార్యకలాపాలు మాత్రం నిత్యకృత్యాలైపోతున్నాయి. ముఖ్యంగా భారత సరిహద్దుల్లోని జమ్ము కాశ్మీర్ లో ఉగ్రవాదులు అడపాదడపా పంజా విసురుతునే ఉన్నారు. భారత సరిహద్దులోని దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. భద్రతా దళాలపై ఎదురు కాల్పులు జరిపారు.సోమవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు ఆర్మీ సిబ్బంది మృతిచెందారు. సోమవారం రాత్రి ఆర్మీ సిబ్బంది, జమ్ము కాశ్మీర్ పోలీసులు కలిసి ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.


అరగంట పాటు కాల్పలు..

హఠాత్తుగా టెర్రరిస్టులు ఆర్మీ అధికారులపై కాల్పులు జరిపారు. ఊహించని వారి చర్యతో అవాక్కయిన ఆర్మీ సిబ్బంది ఎదురుకాల్పులకు సిద్ధపడ్డారు. దాదాపు అరగంటపాటు జరిగిన కాల్పులతో దోడా అటవీ ప్రాంతం దద్దరిల్లింది. ఈ దాడిలో నలుగురు ఆర్మీ జవానులు అక్కడికక్కడే చనిపోగా..ఒక పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. వారిని ఆసుపత్రికి తరలించారు.


Also Read: Pakistan Funding Terrorists: భారత్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉగ్రవాదుల చర్యలు.. ఉగ్ర శిబిరాలకు ఆర్థిక సాయం అందిస్తున్న పాకిస్తాన్

ఉగ్ర కార్యకలాపాపై నిఘా..

దోడా అటవీ ప్రాంతానికి అదనప బలగాలు కావాలని కేంద్రాన్ని కోరామని స్థానిక పోలీసులు చెబుతున్నారు. అక్కడ ఉగ్రవాదుల కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో కేంద్ర రక్షణ శాఖ ఈ ప్రాంతానికి అదనపు బలగాలను పంపించింది. భారత ఆర్మీపై కాల్పలు జరిపి వారి మరణానికి కారకులైన వార కశ్మీర్ టైగర్స్ గా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా యుద్ధభూమిని తలపిస్తోంది. మరిన్ని అదనపు బలగాలతో అటవీ ప్రాంతాన్ని ఆర్మీ జవానులు జల్లెడ పడుతున్నారు. ఉగ్రవాదులు ఎక్కడ కనిపించినా, వారి స్థావరాలు ఎక్కడ ఉన్నా కాల్చిపారేయాలని పై స్థాయి అధికారుల ఆదేశాలతో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం చేపట్టారు సైనిక అధికారులు.

Related News

Nepal Protests: భారత్-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్తతలు! విమాన సర్వీసుల నిలిపివేత..

Modi-Trump: మోదీ–ట్రంప్ వాణిజ్య చర్చలు.. ఎక్స్ వేదికగా ప్రకటన

Vice President: భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్..

Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నిక.. రాధాకృష్ణన్ Vs సుదర్శన్ రెడ్డి

Social Media Ban: నేపాల్‌లో హింసాత్మకంగా యువత నిరసనలు.. కాల్పుల్లో 20 మంది మృతి

Amruta Fadnavis: బీచ్‌‌ను శుభ్రం చేసిన సీఎం భార్య.. ఆమె డ్రెస్ చూసి నోరెళ్లబెట్టిన జనం

×