E-Paper
Advertisement

Preity Zinta: రోహిత్ కోసం ఉన్నదంతా ఇచ్చేస్తా: ప్రీతి జింతా

Preity Zinta: రోహిత్ కోసం ఉన్నదంతా ఇచ్చేస్తా: ప్రీతి జింతా
Advertisement

Preity Zinta On Rohit Sharma: ఒకనాటి బాలీవుడ్ అందాల హీరోయిన్ ప్రీతిజింతా.. సొట్ట బుగ్గల సుందరిగా, తెలుగు సినిమాల్లో కూడా నటించి అలరించింది . అలాంటి తను సడన్ గా సినిమాలు మానేసి ఐపీఎల్ క్రికెట్ లో అడుగుపెట్టింది. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ సహ పార్టనర్ షిప్ గా మారిపోయింది. అంతా తానై అన్నీ ముందుండి నడిపిస్తోంది.

ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ కి శిఖర్ ధావన్ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే తన వరకు బాగానే ఆడుతున్నాడు గానీ, జట్టుని సమర్థవంతంగా నడిపించలేకపోతున్నాడనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మ ముంబయిని వీడుతాడనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అది కూడా నిజం కావచ్చు.

Advertisement

ఎందుకంటే వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. అప్పటికి జట్లలో చాలామంది ఆటగాళ్ల కాంట్రాక్టులు పూర్తవుతాయి. అలా రోహిత్ శర్మది కూడా అయిపోతుంది. అప్పటికి ఫ్రాంచైజీ ఇష్టం, లేదా ఆటగాడి ఇష్టం…ఈ రెంటిమీదా డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రాంచైజీ ఉంచుకుంటే గొడవే లేదు.

కానీ ఆటగాడు, ఆ ఫ్రాంచైజీ వద్దనుకుంటే కాంట్రాక్టు పీరియడ్ అయిపోతుంది కాబట్టి, నిరభ్యంతరంగా బయటకు వచ్చేయవచ్చు. ఈ క్రమంలో రోహిత్ శర్మ కోసం ఫ్రాంచైజీలన్నీ క్యూ కడుతున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ సన్ రైజర్స్ కూడా రోహిత్ శర్మ మావాడే, తను మాకే కావాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టింది.

Advertisement

చాలా జట్లలో కుర్రవాళ్లే కెప్టెన్లుగా ఉన్నారు. వారిలో చెన్నయ్, ఢిల్లీ, కోల్ కతా వీరు కూడా రోహిత్ శర్మ వస్తే తీసుకుందామని చూస్తున్నారు. అలాగే ఇప్పుడు వీరి జాబితాలో పంజాబ్ ఫ్రాంచైజీ కూడా వచ్చి చేరింది. ఆ జట్టు సహ యజమానురాలు ప్రీతిజింతా ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు రోహిత్ అభిమానులు నెట్టింట పండగ చేసుకుంటున్నారు.

Also Read: రోహిత్ సెంచరీ వృథా : ధోనీ సేన ఘన విజయం

ఇంతకీ ప్రీతిజింతా ఏమంది అంటే.. రోహిత్ వస్తానని అంటే, ఉన్నదంతా ఇచ్చేస్తానని బోల్డ్ స్టెట్మెంట్ ఇచ్చింది. దీంతో ఈ వార్త నెట్టింట గుప్పుమన్నాది. ఉన్నదంతా అంటే ఏమిటి ప్రీతి? అని కొందరు అడుతున్నారు. ఫ్రాంచైజీలో ఉన్న డబ్బులన్నీనా? అని మరికొందరు అమాయకంగా అడుగుతున్నారు. అవికాక ఇంకేం ఉన్నాయని మరికొందరు అడుగుతున్నారు.

మొత్తానికి ప్రీతి నెటిజన్లకు గొప్ప పనే పెట్టిందని మరికొందరు నవ్వుతూ వ్యాఖ్యానిస్తున్నారు.

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×